Telangana : నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుంది. మార్చి 27 నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఈ మేరకు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారుంటే వెంటనే చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.

New Update
TS TET : మే 20 న తెలంగాణ టెట్‌... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే!

TET Exam : తెలంగాణ(Telangana) టెట్ దరఖాస్తు(TET Applications) ల సమయం అయిపోవస్తోంది. ఈరోజుతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. మార్చి 27 నుంచి మొదలైన ఈ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తోంది. రేపటి నుంచి అప్లికేషన్ల పరిశీలన మొదలవుతుంది. ఏప్రిల్15 నుంచి హాల్ టికెట్ల జారీ ప్రారంహం అవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో విద్యాశాఖ టెట్ పరీక్షలను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు దీని కోసం 1,95,135 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ చెబుతోంది. అయితే గతంతో పోలిస్తే ఈ సారి బాగా తగ్గాయని అంటోంది. ఈరోజు మరికొంత మంది అప్లే చేసుకున్నా ఈ సంఖ్య రెండు లక్షలు దాటకపోవచ్చని తెలిపింది.

DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 3 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి డీఎస్సీ కి ముందు టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఓ కమిటీని వేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరువాత డీఎస్సీ కన్నా ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పని చేయాలనుకునేవారికి టెట్ కావాలి. టెట్ అర్హత ఉన్నవారికే రిక్రూట్ మెంట్ పరీక్ష టీఆర్టీ రాసే అవకావం ఉంటుంది. పేపర్ 1 పరీక్షకు డీఈడీ అర్హతతో పాటూ ఇంటర్‌లో జనరల్ అభ్యర్ధులకైతే 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. 2015లోపు డీఈడీ పూర్తి చేసిన వారు జనరల్ అభ్యర్దులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, 40 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్‌కు వెయ్యి ఫీజు చెల్లించాలి. జూన్ 12న టెట్ ఫలితాలు(TET Results) విడుదల అవుతాయి.

Also Read:Cricket : ఒక్క మ్యాచ్ అతని జీవితాన్ని మార్చేసింది.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన స్పీడ్‌గన్ మయాంక్

Advertisment
తాజా కథనాలు