Telangana : నామినేషన్లకు నేడే చివరి తేది.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే

రాష్ట్రంలో లోక్‌సభ నామినేషన్ల పర్వం గురువారం నాటికి ముగియనుంది. మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం మొత్తం 13 మంది నామినేషన్లు వేశారు.

New Update
Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..

Lok Sabha Nominations : రాష్ట్రంలో లోక్‌సభ నామినేషన్ల(Lok Sabha Nominations) పర్వం గురువారం నాటికి ముగియనుంది. మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌(Hyderabad) లోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం మొత్తం 13 మంది నామినేషన్లు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) తెలంగాణ(Telangana) కు సాధారణ, శాంతి భద్రతల, ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. వీళ్లందరూ గురువారం నాడు ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లనున్నారు.

Also read: నేడు రఘురామిరెడ్డి నామినేషన్.. భట్టి, తుమ్మల దూరం !

సాధారణ పరిశీలకులుగా.. ఐఏఎస్ అధికారులు, శాంతి భద్రతల పరిశీలకులుగా ఐపీఎస్ అధికారులు, వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌, అలాగే ఐటీకి చెందిన అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీళ్లు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారు. అలాగే రాజకీయ పార్టీల ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో మే 13 న లోక్‌సభ, అలాగే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇక జూన్‌ 4న దేశం మొత్తం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మే 12, జూన్ 4న సెలవు దినాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

Also Read: ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు