Bank Jobs : నిరుద్యోగులకు అలర్ట్...600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ...!! బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ప్రైవేట్ రంగ ఐడీబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ ప్రాసెన్ ను ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నేటితో అంటే సెప్టెంబర్ 30తో ముగియనుంది. By Bhoomi 30 Sep 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ప్రైవేట్ రంగ ఐడీబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ ప్రాసెన్ ను ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నేటితో అంటే సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు idbibank.in అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అర్హతలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 20ఏళ్ల నుంచి గరిష్టంగా 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు నిబంధనలు వర్తించనున్నాయి. గుర్తింపు పొంది విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు లేదంటే దానికి సమామైన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లామా చేసినవాళ్లు ఈ ఉద్యోగాలకు అనర్హులు అంటూ బ్యాంక్ ప్రకటించింది. ఇది కూడా చదవండి: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన…!! దరఖాస్తు ప్రక్రియ: -పై పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ ట్ idbibank.in ను ఓపెన్ చేసి...అందులో హోం పేజీకి వెళ్లండి. అక్కడ కనిపించే కెరీర్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. -ఇప్పుడు న్యూ పేజీలో కనిపించే రిక్రూట్ మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ లింక్ ను ఓపెన్ చేయండి. IDBI Bank PGDBF – 2023-24. ఇలా కనిపిస్తుంది లింక్. -ఇప్పుడు అభ్యర్థులు రిజిస్టర్ చేసుకుని...అప్లికేషన్ ఫారమ్ యాక్సెస్ చేసుకోవాలి. -ఫారమ్ లో అడిగిన అన్ని వివరాలను నమోదు చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత సబ్మిట్ చేయాలి. -జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రక్రియలో ముందుగా ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయితేనే పర్సనల్ ఇంటర్య్వూకి సెలక్ట్ చేస్తారు. మొత్తం 600పోస్టుల్లో 243 జనరల్ కేటగిరికి కేటాయించారు. మిగిలిన 162 ఓబీసీ, 90 ఎస్సీ, 45ఎస్టీ, 60 ఈడబ్య్లూఎస్ విభాగాలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!! జీతభత్యం: ఇందులో సెలక్ట్ అయిన అభ్యర్థులకు మొదటి 6నెలలు ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు రూ. 5వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 2నెలలు ఇంటర్న్ షిప్ సమయంలో అభ్యర్థులు నెలకు రూ. 15వేల తీసుకుంటారు. పీజీడీబిఎఫ్ కోర్సును పూర్తిచేసిన అనంతరం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గా బ్యాంకులో జాయిన్ అవుతారు. అప్పుడు వార్షిక వేతనంగా ఏడాదికి రూ.6 14 నుంచి 6.50 లక్షల మధ్య జీతం ఉంటుంది. #jobs #bank-jobs #idbi-bank-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి