Deepika Padukone: నేడు దీపికా పదుకోణె బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోణె నేడు తన 38వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా దీపికకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరిన్ని సినిమాలతో అలరించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నారు.

Deepika Padukone: నేడు దీపికా పదుకోణె బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
New Update

Deepika Padukone:బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోణె నేడు 38వ పడిలోకి అడుగుపెట్టింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన బ్యూటీ అనతికాలంలోనే మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, లాల్ పౌడర్, క్లోజప్ టూత్ పేస్టు, లిమ్కా ప్రకటనల్లో నటించిన జనాలకు పరిచయమైన బ్యూటీ ఈ క్రమంలోనే మోడలిగ్ నుంచి సినీ ఇండస్ట్రీవైపు అడుగులేసింది. మొదట బాలీవుడ్ హీరో హిమేష్ రేష్మియా 'ఆప్ కా సురూర్'(Aap Kaa Surroor) అల్బమ్ లోని 'నాం హై తేరా' అనే మ్యూజిక్ వీడియోతో కెరీర్‌ మొదలుపెట్టింది. ఆ తర్వాత వెంటనే 2006లో ఉపేంద్ర హీరోగా వచ్చిన కన్నడ సినిమా 'ఐశ్వర్య'తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన ఆమె.. 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం 'ఓం శాంతి ఓం'((Om Shanti Om)తో భారీ పాపులారిటీ దక్కించుకుంది.

publive-image

ఇక కొంతకాలంగా స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer sing)తో డేటింగ్ చేసిన దీపికా 2018లో అతన్ని పెళ్లిచేసుకుంది. అయితే అందరిలాగా కాకుండా పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె ఇటీవల మరింత హాట్ హాట్ సీన్స్ తో అదరగొట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వచ్చిన షారుఖ్ మూవీ 'పఠాన్' (Patan)తోపాటు 'జవాన్' (Jawan)లోనూ తన ఫర్మార్మె్న్స్ తో అలరించింది. అలాగే త్వరలో హృతిక్ హీరోగా రాబోతున్న 'ఫైటర్'(Fighter)లోనూ బోల్డ్ అవతార్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించేందుకు రెడీ అవుతోంది.

ఇది కూడా చదవండి : BIG BREAKING: ఎంపీ టికెట్ పై కేశినేని నాని సంచలన ప్రకటన

ఇక దీపిక టాలెంట్ పై ఇప్పటికే పలువురు ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించగా.. ఇండియా ఎఫ్.ఎంకు చెందిన తరణ్ (Tarun) ఆదర్శ్ ఇలా అన్నారు.. 'ఒక పెద్ద స్టార్ అవడానికి దీపికకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఆమె వ్యక్తిత్వం, కనిపించే తీరు అద్భుతం. ఆమె ఎంతో ప్రతిభావంతురాలు కూడా. షారుఖ్ తో కలిసి ఒకే ఫ్రేములో నిలబడటం.. దాన్ని ఫర్ఫెక్ట్ గా చేయడమనేది చిన్న విషయం కాదు. ఆమె నడిచివస్తుంటే స్వచ్ఛమైన చిరుగాలి వీస్తున్నట్టుగా ఉంటుంది' అని చెప్పడం విశేషం.

ఫిల్మ్ ఫేర్ అవార్డులు :
'ఓం శాంతి ఓం' సినిమాకు గానూ 2008 ఫిల్మ్ ఫేర్ (Film fair) ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. అలాగే 'ఓం శాంతి ఓం' 2008లో ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అవార్డు (Filmfare Best Female Debut Award) సొంతంచేసుకుంది. 2008లోనే 'సోనీ హెడ్ అండ్ శోల్డర్స్ ఫ్రెష్ ఫేస్ అఫ్ ది ఇయర్ అవార్డు'కు నామినేట్ అయింది. 2022లో ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన 75వ కేన్స్ ఫిలిం పెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో సభ్యురాలిగా నియమితురాలవడం చెప్పుకొదగిన విషయం.

ఇక తమ అభిమాన నటి బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. భవిష్యత్తులోనూ మరెన్నో సినిమాలతో అలరించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరకుంటున్నారు.

#birthday #deepika-padhukone
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి