Today Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే.. 

బంగారం ధరలు దిగివస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు (డిసెంబర్ 12) మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.56,950లు గాను, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,130లు గాను ఉంది. వెండి కేజీకి రూ.77,800 గా ఉంది. 

Today Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే.. 
New Update

Todays Gold Rates In Hyderabad : బంగారం అంటే మన ప్రజలకి ఎంత ఇష్టం అంటే.. చక్కగా ఉన్న దేనినైనా బంగారంతోనే పోలుస్తారు. బంగారం లాంటి ఉద్యోగం అనో.. బంగారం లాంటి పిల్లలు అనో.. ఇలా పొగడ్తలకు కూడా బంగారం పేరు వాడేస్తారు. మరి ఇక బంగారం ఆభరణాలు అంటే ఎంత మోజు ఉంటుందంటే.. తులం బంగారంతో చిన్న గొలుసు అయినా చేయించుకోవాలని ఆశపడని వారు దాదాపుగా ఉండరు. అందుకే బంగారం ధరలు పైకీ..కిందికీ కదులుతూ ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తే ఒకలా.. పండగల సీజన్ లో మరోలా బంగారం ధరలు మారుతూ వస్తాయి. అంతర్జాతీయంగా ఉండే ధరలూ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అంతేకాదు డిమాండ్ బట్టి బంగారం ధర ఎప్పటికప్పుడు మారిపోతుంది. ముందు వారంలో వరుసగా పై పైకి వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త కిందికి వస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త దిగివచ్చాయి. 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు(Today Gold Rates) భారీగా పడిపోతున్నాయి. అలాగే, దేశీయంగా డిమాండ్ తగ్గుతూ వస్తోంది. దీంతో గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పట్టాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు పది గ్రాముల బంగారం 220 రూపాయల వరకూ తగ్గుదల కనబర్చగా.. వెండి కూడా అదేదారిలో కేజీకి 200 రూపాయల మేర తగ్గింది. ఈరోజు అంటే మంగళవారం (డిసెంబర్ 12) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Today Gold Rates) రూ. 200లు తగ్గింది. దీంతో రూ.56,950లకు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220ల వరకూ తగ్గింది. దీంతో రూ.62,130ల వద్ద నిలిచింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి రూ.57,050ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 220 రూపాయలు తగ్గి.. రూ.62,280ల దగ్గర ఉంది. 

Also Read: భలే ఛాన్స్ లే.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. 

ఇక వెండి ధరలు కూడా ఈరోజు దిగివచ్చాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 200 రూపాయలు తగ్గింది. రూ.77,800ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ లోనూ వెండి రేటు కేజీకి 200 తగ్గి రూ.75,800ల వద్ద ఉంది. 

అంతర్జాతీయంగా బంగారం ధరలు(Today Gold Rates) భారీగా తగ్గాయి. గత వారంలో ఔన్స్ బంగారం 2050డాలర్లకు చేరుకొని టెన్షన్ ఎత్తిన బంగారం మెల్లగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు ఔన్స్ బంగారం క్రితం రేటు కంటే 20 డాలర్లు తగ్గి, 1983 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర 22.82 డాలర్లుగా ఉంది. 

గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. 

Watch this interesting Video:

#gold-rates-dropped #gold #gold-lovers #gold-and-silver-latest-prices #gold-and-silver-price
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe