Gold Rate Today: బంగారం కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు తగ్గుదల కనబర్చాయి. అమెరికా డాలర్, బ్యాండ్ ఈల్డ్ లకు పెరిగిన డిమాండ్ తో పాటు ఫెడ్ వడ్డీ రేతల్ను పెంచవచ్చు అనే సంకేతాల మధ్యలో బంగారం ధరలు దిగివచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ధరలు బాగా తగ్గినా.. ఇప్పటికీ గరిష్ఠస్థాయిలోనే నిలిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. అయితే, ఈరోజు తగ్గుదల తాత్కాలికం గానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. దేశీయంగా తగ్గిన బంగారం ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లో ఇలా..
హైదరాబాద్ లో ఈరోజు (Gold Rate) అంటే డిసెంబర్ 1 వతేదీ మార్కెట్ ప్రారంభ సమయానికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 600 రూపాయలు తగ్గింది. ఇది రూ.57,500లకు దిగి వచ్చింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.650లు తగ్గి రూ.62,730ల వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తంగా చూసుకుంటే బంగారం ధరల్లో తగ్గుదల నమోదు అయింది.
ఢిల్లీలో ఇలా..
దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధరలు(Today Gold Rate) తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.600లు తగ్గి 57,650 రూపాయలకు చేరుకుంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.650 రూపాయాలు తగ్గడంతో రూ.62,880ల వద్ద నిలిచింది.
Also Read: బాబోయ్ అనిపిస్తున్న బంగారం.. గోల్డ్ ఎందుకు? ఇది చాలు అంటున్న యువత!
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశేయా మార్కెట్లో బంగారం ధరలు దిగివచ్చాయి. అలాగే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కేజీ వెండి ధరలో ఎటువంటి మార్పు లేకుండా రూ.79,200 రూపాయల వద్ద స్థిరంగా నిలిచింది. అదేవిధగా హైదరాబాద్ లో వెండి ధరలు కేజీకి ఎటువంటి మార్పులు లేకుండా రూ.82,200 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా..
దేశీయంగా బంగారం ధరలు(Today Gold Rate) ఈరోజు తగ్గాయి. అయితే అదేసమయంలో అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ పైకెగశాయి. ఈరోజు బంగారం ధరలు అంతర్జాతీయంగా ఔన్స్ కు 2043 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక వెండి ధర 25.42 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, అంతర్జాతీయంగా వచ్చే మార్పులు.. స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం. అలాగే బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ చూసి కొనుగోలు చేయడం తప్పనిసరి.
Watch this interesting Video: