Motivation: ఈ విషయం తెలుసుకుంటే ఓడిపోయినా బాధపడరు.. మరి తెలుసుకోండి!

పదే పదే వైఫల్యాలు ఎదురైతే ఏం చేయాలి..? పరాజయాలను ఎలా ఎదుర్కోవాలి..? ఈ ఫెయిల్యూర్‌కు కారణం ఏంటి..? ఓడిపోయినా బాధపడకుండా ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Motivation: ఈ విషయం తెలుసుకుంటే ఓడిపోయినా బాధపడరు.. మరి తెలుసుకోండి!

Motivation: మనిషి జీవితంలో విజయాలు, అపజయాలు అనేవి సర్వ సాధారణం. కొందరైతే పట్టిందన్న బంగారం కాలనే ఆలోచనతో ఉంటారు. మరి కొందరూ ఎంత కష్టపడినా ఫలితం దక్కక నిరుత్సాహం పాలవుతారు. ఇక చదువుకున్న యువత పట్ల అయితే చెప్పాల్సిన పని లేదు.. వారు ఎంతో చదువుకుని ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులుగా ఉండి ఎంత కష్టపడి చదవిన ఉద్యోగాలు రావట్లేదు. దీంతో కొంతమంది డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే ఓ వ్యక్తి పదే పదే వైఫల్యాలు ఎదురైతే ఏం చేయాలి..? పరాజయాలను ఎలా ఎదుర్కోవాలి..? ఈ ఫెయిల్యూర్‌కు కారణం ఏంటి..? అనేదానిపై కొన్ని అధ్యయాలు చేశారు. ఈ నియమాలు పాటిస్తే.. శత్రువులు కూడా ఆశ్చర్యపోయేలా ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు.

అలోచనలకు అనుగుణంగా పని చేయాలి:

మన ఆలోచ విధానమే మన విజయానికి దారితీస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే.. ఏవరైనా ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ.. ఆ ఆలోచనలను అమలు చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీని వలనే ఓటమి ఎదురవుతుందని నిపుణులు అంటున్నారు. గెలుపు దక్కలంటే.. ఆలోచించడమే కాకుండా ఆ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని సూచిస్తున్నారు. లేకపోతే పదే పదే ఫెల్యూర్‌ అవుతారని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నించినా.. కష్టపడి చదువుతున్నట్లైతే.. ఎలా చదవాలి..? ఉద్యోగం ఎలా దక్కుతుంది..? రోజులో ఎన్ని గంటలు చదవాలి..? ఎంత పోటీ ఉంది..? చదివే సబ్జెక్టుకు ఎంత టైం ఇవ్వాలి..? అనే దానిపై ముఖ్యంగా ద‌ష్టి పెట్టాలని చెబుతున్నారు.

కొన్ని కఠినమైన సమస్యలు ఎదుర్కొవాలి:

ప్రతి వ్యక్తి లక్ష్యం పెట్టుకోవాలని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.మీ లక్ష్యాన్ని సాధించే దారిలో ఎంలాటి సమస్యలైనా ఎదుర్కొవాలి. లేకపోతే మీ గోల్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎదుగుతున్న క్రమంలో చిన్న చిన్న తప్పులు, కొన్ని కఠినమైన సమస్యలు రావటం సహజం. వాటిని పెద్దగా పట్టించుకోకూండా, అలర్ట్‌గా ఉండాలి. మీరు లక్ష్యం లేకుండా ఏ పని చేసినా అసాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు చేస్తున్న పనిపై స్పష్టత ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత యువతుల్లో హార్మోన్ల మార్పులు..ఆ సమయంలో ఈ డైట్ తీసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు