IPS: ఐపీఎస్‌ కావాలంటే ఈ శారీరక ప్రమాణాలు ఉండాల్సిందే..!

IPS: ఐపీఎస్‌ కావాలంటే ఈ శారీరక ప్రమాణాలు ఉండాల్సిందే..!
New Update

ఐఏఎస్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వీసెస్‌లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఒకటి. ఈ సర్వీస్‌కు ఎంపికైతే, రాష్ట్ర పోలీసు, RAW, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (IB) వంటి ఏజెన్సీల్లో DGP స్థాయికి ఎదగవచ్చు. అలాగే ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ (IRPFS), ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (IRMS)లో చేరవచ్చు. ఐపీఎస్‌కు ఉండాల్సిన కనీస ఎత్తు, కంటి దృష్టి ప్రమాణాల వివరాలు ఇలా…

కనీస ఎత్తు ప్రమాణాలు

యూపీఎస్సీ ప్రకారం.. ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన అభ్యర్థుల కనీస ఎత్తు 165 సెం.మీ ఉండాలి. స్త్రీ, లింగమార్పిడి అభ్యర్థులు 150 సెం.మీ ఎత్తు తప్పనిసరిగా ఉండాలి. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్(IRMS) పోస్టులకు ఎంపికైన పురుష అభ్యర్థులు కనీసం 152 సెం.మీ ఎత్తు ఉండాలి. స్త్రీ, లింగమార్పిడి అభ్యర్థులకు ఎత్తు 150 సెం.మీ తప్పనిసరి.

ఈ అభ్యర్థులకు సడలింపులు

రిజర్వ్డ్ కేటగిరీతో పాటు గూర్ఖా, అస్సామీ, కుమౌని, నాగాలాండ్ నివాసిత అభ్యర్థులకు కనీస అర్హత ప్రమాణాల్లో గణనీయమైన సడలింపులు ఉంటాయి. సడలింపు తర్వాత పైన పేర్కొన్న కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు కనిష్ట ఎత్తు పరిధి 160 సెం.మీ ఉంటుంది. స్త్రీ, లింగమార్పిడి అభ్యర్థులకు అవసరమైన ఎత్తు 145 సెం.మీ గా నిర్ణయించారు.

కంటిచూపు ప్రమాణాలు

ఐపీఎస్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులు నిర్దిష్ట కంటి చూపు ప్రమాణాలను కలిగి ఉండాలి. యూపీఎస్సీ ప్రకారం.. IPS కోసం 6/6 లేదా 6/9 విజన్ అర్హతగా పరిగణిస్తారు.

ట్రైనింగ్ వివరాలు

దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ఐపీఎస్ అధికారుల ప్రధాన కర్తవ్యం. అందుకు తగినట్లుగానే శిక్షణ అందిస్తారు. ట్రైనింగ్‌లో చాలా దశలు ఉంటాయి. ఫౌండేషన్ కోర్సు, ఫేజ్ I ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఫేజ్ II ట్రైనింగ్ వంటి నాలుగు దశల్లో ఐపీఎస్ అభ్యర్థులకు కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. ఫౌండేషన్ కోర్సు కోసం లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)-ముస్సోరీలో ట్రైనింగ్ ఉంటుంది. ఫేజ్-1 ట్రైనింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)- హైదరాబాద్‌లో ఉంటుంది. జిల్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం సంబంధిత కేడర్‌కు కేటాయిస్తారు. ఫేజ్ II ట్రైనింగ్ SVPNPA-హైదరాబాద్‌లో ఉంటుంది.

స్టైఫండ్

ఐపీఎస్ ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ నెలకు రూ.15,600 నుంచి రూ.39,100 మధ్య లభిస్తుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నెలకు రూ.56,100 జీతం లభిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్, వసతి భత్యం, వైద్య ప్రయోజనాల వంటి ఇతర అలవెన్సులు ఉంటాయి.

#jobs #ips #police-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe