IPS: ఐపీఎస్ కావాలంటే ఈ శారీరక ప్రమాణాలు ఉండాల్సిందే..!
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 15 వేల పోలీసు ఉద్యోగ ఖాళీల భర్తీకి మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులు దరఖాస్తుకు సిద్దంగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు.
ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.