Tirumala: చాలా రోజుల తరువాత పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం! తిరుమల శ్రీవారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. గడిచిన రెండు మూడు నెలల నుంచి రాని ఆదాయం కేవలం సోమవారం ఒక్కరోజే వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్ల పైగా వచ్చిందని వివరించారు. By Bhavana 13 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి చాలా రోజుల తరువాత తిరుమల(Tirumala) శ్రీవారి హుండీకి (Hundi) భారీగా ఆదాయం వచ్చింది. డిసెంబర్ 11 న స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 64, 882 మంది భక్తులు వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. దీంతో స్వామి వారి ఆదాయం రూ. 5.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. సోమవారం (Monday) ఒక్కరోజే 24,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు సమాచారం. మంగళవారం కూడా భక్తులు 13 కంపార్ట్ మెంట్లలో స్వామి వారిని దర్శించుకునేందుకు వేచి ఉన్నారు. సర్వ దర్శనం టికెట్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతున్నట్లు ఆలయాధికారులు వివరించారు. స్వామి వారికి గత రెండు మూడు నెలల నుంచి ఒక్కరోజు కూడా రూ. 5 కోట్లు దాటలేదు. సోమవారం ఒక్కరోజే 5 కోట్లకు(5 crores) పైగా ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కీలక విషయాలను సూచించారు. ఈ నెల 23 నుంచి స్వామి వైకుంఠ ద్వారా దర్శనం (Vaikunta darsanam) ప్రారంభం అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు మొత్తం పదిరోజుపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. దీనికోసం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం కోసం తిరుపతి,తిరుమలలోని 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4.25 లక్షల టోకెన్లు ఇవ్వనున్నారు. రోజుకి 42,500 చొప్పున 10 రోజుల్లో 4.25 లక్షల టోకెన్లు రిలీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మీరు తిరుమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లయితే మాత్రం ఈ టోకెన్లు తీసుకోవడం మంచిది. అలాగే మీరు తిరుమల వెళ్లే ముందు అక్కడి పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు తిరుమల వెళ్లే సమయంలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందా ? లేదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉందా? వంటి విషయాలను కూడా తెలుసుకోవాలి.ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు ఇలా వర్షాలు పడితే..సమస్యలు తప్పవ. ఈ సమయంలో అక్కడ చలి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. Also read: శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు! #srivari-hundi #money #tirumala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి