Another Chirutha Caught in Tirumala: ఒక చిరుత తర్వాత మరో చిరుత.. ఇలా తిరుమలలో వరుస పెట్టి చిరుతలు చిక్కుతూనే ఉన్నాయి. బోనులో పడుతూనే ఉన్నాయి. అటవీశాఖ అధికారుల ట్రిక్కులు పని చేసి ట్రాప్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. ఐదో చిరుత బోనులో చిక్కినట్టు ప్రకటించారు అటవీశాఖ అధికారులు. కొన్ని రోజుల క్రితమే ఈ చిరుత కదలికలను గుర్తించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డవడంతో అప్రమత్తమయ్యారు. అది సంచరిస్తున్న ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. వాటిలోని ఓ బోనులో చిక్కింది చిరుత. ఇది కూడా మగ చిరుతే. మరోవైపు నడకమార్గం, ఘట్‌రోడ్డులలో చిరుతల కోసం సేర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
ఇప్పటివరకు మొత్తం ఐదు:
మూడు నెలల వ్యవధిలో మొత్తం ఐదు చిరుతలను పట్టుకున్నారు అధికారులు. గత జూన్‌లో కౌశిక్ అనే బాలుడు చిరుత చేతికి చిక్కి గాయపడడం.. ఆ తర్వాత ఆగస్టు 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత (Lakshitha) చిరుత దాడిలో మృతి చెందడంతో అధికారులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వరుస పెట్టి ఘటనలు జరుగుతుండడంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర నుంచి స్పెషల్‌గా బోనులను తెప్పించింది. వాటిలోనే చిరుతపులులు చిక్కాయి. జూన్ 24న మొదటి చిరుత, ఆగస్ట్ 14న రెండో చిరుత, ఆగస్ట్ 17న మూడో చిరుత చిక్కింది. ఆగస్టు 28న నాలుగో చిరుత చిక్కింది. ఇక ఇవాళ(సెప్టెంబర్ 7) ఐదో చిరుత చిక్కింది.
Also Read: Nalgonda Suicide: అన్నా.. మందు తాగినం.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఆడియో వైరల్
ప్రస్తుతం ఈ చిరుతలను తిరుపతిలోని SV జూలాజికల్ పార్క్‌లో ఉంచారు. వీటిలో ఏ చిరుతపులి ప్రాణాంతక దాడికి పాల్పడిందో తెలుసుకోవడానికి అధికారులు ఫోరెన్సిక్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కిల్లర్ చిరుతపులి గుర్తింపును నిర్ధారించిన తర్వాత దాన్ని జూలో నిర్బంధిస్తారు. అటవీ అధికారుల సూచనల మేరకు పట్టుబడిన ఇతర చిరుతపులిలను తిరిగి అడవుల్లోకి విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. భక్తులు, వన్యప్రాణుల భద్రత కోసం చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతమంతా చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
తిరుమలలో కర్రల పంపిణీ:
విమర్శలకు తావులేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అలిపిరి కాలినడకన తిరుమల కొండ పట్టణానికి వెళ్లే భక్తులకు చెక్క కర్రల పంపిణీని ప్రారంభించింది. నడకదారి పరిసరాల్లో వన్యప్రాణుల నుంచి భక్తులకు భద్రత కల్పించడమే లక్ష్యం. నిన్న(సెప్టెంబర్ 7) అలిపిరి కాలిబాట ప్రారంభం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్, టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ధర్మారెడ్డితో కలిసి భక్తులకు కర్రలను అందజేశారు. ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ భక్తుల భద్రతకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. అడవి జంతువులు ఫుట్‌పాత్‌పైకి రాకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా వాటి కదలికలను పర్యవేక్షించేందుకు 500 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.
ALSO READ: తిరుమల కాలినడక భక్తులకు చేతికర్రల పంపిణీ ప్రారంభం