Health Tips: పెరుగుతున్న డయేరియా రోగులు.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి! విపరీతమైన వేడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో డీహైడ్రేషన్, డయేరియా బారిన పడుతారు.ఈ వేసవిలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు డయేరియా బారిన పడుతున్నందున వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 29 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Tips: ఈ రోజుల్లో చాలా వేడిగా ఉంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సామాన్యులకు రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎండ వేడిమికి జనం డీహైడ్రేషన్, డయేరియా బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ సీజన్‌లో హీట్‌స్ట్రోక్, హీట్‌ను ఎలా నివారించాలో చాలామందికి తెలియదు. మీరు డయేరియాతో బాధపడుతుంటే స్పైసీ ఫుడ్, పాల ఉత్పత్తులు, కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వేడి కారణంగా డయేరియా రోగులు రోజురోజూకు పెరుగుతున్నారు. ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలో..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. డయేరియా రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలు: ఈ విపరీతమైన వేడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో డీహైడ్రేషన్, డయేరియా బారిన పడుతారు. ఆస్పత్రికి వచ్చే వారిలో 20 శాతానికి పైగా అతిసార వ్యాధితో బాధపడుతున్నారని, వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా మారుతుంది. దీని కారణంగా చాలా అనారోగ్యానికి గురవుతారు. ఈ వేసవిలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు డయేరియా బారిన పడుతున్నందున వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: వేసవిలో ఉల్లిపాయలను ఎక్కువగా తినాలి.. ఈ ఆనియన్ కర్రీ గురించి తెలుసుకోండి ! #diarrhea #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి