Health: ఈ చిట్కాలు పాటించి చూడండి.. తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి..! మాతృత్వం అవ్వడం మహిళకు దేవుడిచ్చిన గొప్ప వరం. బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు మాసాలైన తల్లి బిడ్డకు పాలివ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల, ఇంగ్లీషు మందుల వాడకం, రసాయన ఆహార పదార్థాలు తినటం వల్ల తల్లిపాలు చాలా వరకు తగ్గిపోయాయి. By Vijaya Nimma 01 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tips to Increase Breast Milk: గర్భం ధరించినప్పటి నుంచీ శిశువు పుట్టే దాకా స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వాటిల్లో ఆహార నియమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇదే క్రమంలో శిశువుకు జన్మనిచ్చిన తర్వాత కూడా తల్లీ, బిడ్డా.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అలాగే చిన్నారులకు పాలివ్వాలంటే తల్లికి పాలు ఉత్పత్తి కావాలి. అయితే.. పాల ఉత్పత్తిలో తల్లి తీసుకునే ఆహారం ముఖ్యపాత్ర వహిస్తుంది. ఈ నేపథ్యంలో శిశువుకు జన్మనిచ్చిన తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: బీజేపీపై మండిపడ్డ రఘువీరారెడ్డి..కలిసి పోరాటం చేయాలని పిలుపు ప్రస్తుతం కాలంలో చాలా మంది బాలింతలకు పాలు సరిగా రాకా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పిల్లలకు సరైన ఫీడింగ్ (Feeding) లభించకపోగా.. పోషకాలు అందడం లేదు. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల తల్లలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. అయితే, తల్లుల్లో పాలు పెరిగేందుకు వంటింటి చిట్కాలే అద్భుతంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలకు తల్లి పాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. తల్లి పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. తల్ల పాటు తాగటం వల్ల పిల్లలు చురుగ్గా, బలంగా ఉంటారు. అంతేకాదు తల్లి పాల్లో రోగనిరోధక శక్తి (Immunity) ఎక్కువగా ఉంటుంది. అందుకే పశిపల్లిలకు కచ్చితంగా తల్లిపాలను ఇవ్వాలని డాక్టర్లు చెబుతుంటారు. కొందరు బాలింతలలో పాలు బాగా ఉత్పత్తి కావు. అలాంటి వారు కొన్ని ఆహార నియమాలు, చిట్కాలు పాటిస్తే తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. కొన్ని మెంతులను (Fenugreek) కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో కొంచం తేనె కలిపి తాగాలి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేసుకోని తాగితే బాలింతల్లో పాలు బాగా పెరుగుతాయి. మెంతుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజన్ పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇలా చేస్తే మంచి పలితాలు మునగకాయలపైన ఉండే పొట్టు తీసి వాటిని చిన్న ముక్కలుగా చేసి వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి. దాన్ని అరకప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగితే మంచి ఫలితం ఉంటుంది. సోంపు గింజలు బాలింతల్లో పాలు ఉత్పత్తి కావడానికి కూడా బాగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో కొన్ని సోంపు గింజలు వేసి బాగా మరిగించి తర్వాత వడకట్టి ఆ నీటిని గోరు వెచ్చగా అయ్యాగా తాగితే చాలా మంచిది. ఇలా రోజుకు 3 నుంచి 4 సార్లు చేస్తే పాలు బాగా ఉత్పత్తి ఎక్కువగా పెరుగుంది.వెల్లుల్లిలో లాక్టోజెనిక్ లక్షణాలు అధికంగా ఉండటం వలన ఇవి బాలింతల్లో పాలను బాగా పెంచుతాయి. రోజూ 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి నేరుగా తినాలి. దీంతో పాలు ఉత్పత్తి బాగా పెరుగుతంది.దాల్చిన చెక్కతో డికాషన్ తయారు చేసుకుని తాగాలి. లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పాలు ఉత్పత్తి పెరుగుంది. రోజూ నీటిలో నానబెట్టిన బాదం పప్పులను (Almonds) తినడం, బాదం పాలు తాగడం వల్ల బాలింతల్లో పాలు ఎక్కువగా పెరుగుతాయి. వీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని రోజు తీసుకోవాలి. వంటింట్లో నిత్యం వినియోగించే.. సహజంగా లభించే పదార్థాలతో తల్లిపాల ఉత్పత్తిని పెంచవచ్చు. వాటిలో బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్, అల్లం, నల్ల మిరియాలు, జీలకర్ర, ఆవుపాలు, హవిజా వంటి పదార్థాలతో తల్లిపాలు బాగా పెంచుతాయని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: హమాస్ ఉగ్రవాదుల్లా చేస్తున్నారు.. నారాయణస్వామి ఫైర్! #health-tips #tips-to-increase-breast-milk #mother-milk-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి