Skin Care: నెల రోజుల్లో శరీరంపై నలుపు పొగొట్టి తెల్లగా మార్చే చిట్కాలు

అందంగా కనిపించాటానికి ఖరీదైన క్రీములను వాడుతుంటారు. ఆడవాళ్లలో మెడ భాగంలో, నుదుటిపై చర్మం నలుపుడి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, నరింజ‌, బ‌త్తాయి జ్యూస్‌లు, నాన‌బెట్టిన న‌ట్స్ ఆహారంగా తీసుకుంటే చర్మంలో నలుపు పోయి మామూలు స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin Care: నెల రోజుల్లో శరీరంపై నలుపు పొగొట్టి తెల్లగా మార్చే చిట్కాలు

Skin Care: అందంగా కనిపించేందుకు చాలా మంది చేయని ప్రయత్నాలు ఉండవు. మార్కెట్‌లలో దొరికే ఖరీదైన క్రీములను వాడుతుంటారు. అయినా మెడ భాగంలో నలుపు, నుదుటిపై చర్మం నలుపు మాత్రం అలాగే ఉంటాయి. ఇలా నల్లగా ఉండటం వల్ల సమస్యలు లేకపోయినా చూసేందుకు అందవిహీనంగా కనిపిస్తారు. ఆడవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా మెడ దగ్గర చర్మం నలుపుగా మారడానికి 4 కారణాలు ఉంటాయి. ఊబకాయం కారణంగా రక్త ప్రసరణ జరగగా కొన్ని భాగాల్లో చర్మం నల్లగా అవుతుంది. అలాగే షుగర్‌ కారణంగా కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

  • ఆడవాళ్లలో పీసీవోడీ కారణంగా కూడా మెడ, ముఖంపై చర్మం నల్లగా మారుతుందని చెబుతున్నారు. అలాగే హైపో థైరాయిడిజం కూడా ఒక కారణమంటున్నారు. హైపో థైరాయిడిజంలో హార్మోన్ల అస‌మ‌తుల్యతతో చర్మం ఇలా అవుతుంది. షుగర్‌ ఉన్నవారిలో ఇన్సూలిన్‌ పెరిగి చర్మం బ్లాక్‌గా అవుతుంది. ఇన్సులిన్ నిరోధ‌క‌త వల్ల చ‌ర్మం కింద ఉండే మెల‌నోసైట్స్ మెల‌నిన్‌ బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మం నల్లబడుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మంలో నలుపు పోతుంది. ప్రతిరోజూ 5 లీటర్ల వరకు నీటిని తాగడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.
  • అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి. ఉదయం వెజిటేబుల్‌ జ్యూస్‌ తాగాలి. విట‌మిన్ ఎ, సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే చర్మంపై నలుపు మాయం అవుతుంది. షుగ‌ర్ అదుపులో ఉండాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాల‌ను తీసుకోవాలి. ఇలా చేస్తే బరువు తగ్గి హార్మోన్లు బాగా ఉత్పత్తి అవుతాయి. మ‌ధ్యాహ్నం 2 పుల్కాల‌ను బాగా కూరతో కలిపి తీసుకోవాలి. సాయంత్రం నారింజ‌, బ‌త్తాయి జ్యూస్‌లు తాగాలి. నాన‌బెట్టిన న‌ట్స్ ఆహారంగా తీసుకుంటే 4 నుండి 5 నెలల్లోనే చర్మం మామూలు స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  పుచ్చకాయను ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు