ఇలా చేస్తే పండుగల్లో, ఆఫీసుల్లో మెరిసిపోవడం ఖాయం పండగ, పార్టీ లేదా రోజూ వెళ్ళే ఆఫీస్ అయినా కొంచెం స్పెషల్‌గా కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. రోజూ కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటాం. మరి అలా ప్రత్యేకంగా కనిపించాలంటే ఏం చేయాలో మీకు తెలుసా. ఇన్సటంట్గా అందంగా మెరిసిపోవడానికి కొన్ని చిట్కాలు. By Manogna alamuru 07 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మనం ఎలా ఉన్నా ప్రత్యేకంగా కనిపించొచ్చు. నలుపు, తెలుపు ఇలాంటివన్నీ పక్కన పెడితే ప్రతీవారిలోనూ అందం ఉంటుంది. కొంతమందికి దానిని బాగా ప్రజెంట్ చేసుకోవడం వస్తుంది మరికొంత మందికి రాదు అంతే తేడా. మన అందం కొట్టచ్చినట్టు కనిపించాలంటే ప్రత్యేకంగా ఏ ప్లార్లర్కీ వెళ్ళక్కరలేదు. ఇంట్లో ఏంచక్కా చిన్న చిన్న చిట్కాలతో మెరిసిపోవచ్చు. అందం విషయంలో తొలి ప్రాధాన్యం ముఖానిదే! ఈ క్రమంలోనే ముఖం, కళ్లు, పెదాలు.. కళగా ఉంటేనే ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. అందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే సరి!చివరి నిమిషంలో అందంగా కనపడాలన్న ఆలోచనతో కనుబొమ్మలు సరిచేయడం, ముఖంపై గల అవాంఛిత రోమాలను తొలగించడం చేయకూడదు. కనుబొమ్మలు మరీ ఎక్కువగా పెరిగాయనుకుంటే చుట్టూ ఉన్న కొన్ని వెంట్రుకలను మాత్రం తొలగించి, మిగిలిన వాటిని కన్సీలర్ సహాయంతో చర్మం రంగులో కలిసేలా చేయాలి. తద్వారా సహజసిద్ధంగా కనిపించే అవకాశం ఉంటుంది. కళ్ల కింద నలుపు ఇప్పుడు చాలా కామన్ సమస్య. కళ్ళ కింద నలుపు ఎక్కువగా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే చల్లని పాలలో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని కాసేపు కునుకు తీయండి. అదే సమయంలో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పండు గుజ్జునో లేక టొమాటో రసాన్నో ముఖానికి, మెడకి ప్యాక్‌లా వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ఒకేసారి రెండు పనులూ పూర్తవుతాయి. సరైన నిద్ర ముఖాన్ని మరింత కాంతివంతం చేస్తుందని మర్చిపోకండి. అందుకే ఎంత హడావిడిగా ఉన్నా నిద్ర సమయాన్ని మాత్రం తగ్గించకండి. కాస్త ఉప్పు, చిటికెడు వంటసోడా కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు మిలమిలా మెరుస్తాయి.పెదాలను చక్కెరతో స్క్రబ్ చేసి, కడిగిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇక హెయిర్ గురించి వస్తే....రోజూ హెయిర్ మీద శ్రద్ధ పెట్టలేము. ఫ్యాక్ లూ అవీ అస్సలు వేసుకోలేము. అలాంటప్పుడు నాలుగు విటమిన్-ఇ ట్యాబ్లెట్లను కత్తిరించి, అందులోని లిక్విడ్‌ని మీ వెంట్రుకలకు సరిపడేంత కొబ్బరి నూనెలో కలిపి కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. ఆపై ఒక ఐదు నిమిషాలు మర్దన చేసి ఇరవై నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి. అంతే నిగనిగలాడే జుట్టు మీ సొంతం అయినట్టే. చేతులకు, కాళ్ళకు మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకునే సమయం లేనప్పుడు చేతికి, కాలికి ఉన్న గోళ్లని షేప్ చేసుకుని, హెయిర్ మాస్క్ కోసం తయారు చేసుకున్న కొబ్బరి నూనె మిశ్రమాన్ని పట్టించాలి.మడమలకి ఉన్న పగుళ్లని, మృత చర్మాన్ని స్క్రబ్బర్‌తో తొలగించాలి.కాళ్లు, చేతులకు కూడా ఫ్రూట్ ఫ్యాక్ లు రాసుకోవచ్చు. రాసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చూశారుగా....పైన చెప్పినవాటికి పెద్దగా టైమ్ పట్టదు. కాకపోతే కొంచెం శ్రద్ధ అవసరం అంతే. రోజులో మనకోసం మనం కేటాయించుకునే టైంలో ఇవి కూడా చేసేస్తే అందం దానితో పాటూ మంచి ప్రశంసలు, ఆనందం మన సొంతం అయిపోతాయి. #beauty #tips #home-remidies #specail-attarction #short-time #instant #no-parlour మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి