drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై గట్టి నిఘా.. లేడి కిలాడి అనురాధ అరెస్ట్‌

హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై గట్టి నిఘా ఉంచారు పోలీసులు. వరుసగా దాడులు చేస్తూ డ్రగ్స్ విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు.తాజాగా మోకిల పీఎస్‌ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ చేతులు మారుతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

New Update
drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై గట్టి నిఘా.. లేడి కిలాడి అనురాధ అరెస్ట్‌

హైదరాబాద్‌లోని మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తున్న కొంతమందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొని వచ్చిన గ్యాంగ్ సభ్యులు అమ్ముతున్నారని DCP జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నైజీరియాకు చెందిన జేమ్స్ వద్ద డ్రగ్స్ లేడి కిలాడి అనురాధ కొనుగోలు చేసింది. గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేశారు. గోవాలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయం చేస్తోంది మాయ లేడి.

వాట్సాప్, స్నాప్ చాట్ ద్వార్వా డ్రగ్స్ సమాచారం ఇస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో డ్రగ్స్ సేవిస్తున్న ఉన్నత వర్గాలను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మోకిలా ఇంద్రారెడ్డి కంచ వద్ద సైబరాబాద్ ఎస్ఓటీ బృందం మాటు వేశారు. పోలీసులను చూడగానే తప్పించుకేనే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. వారిని చేస్ చేసి పట్టుకున్నారు ఎస్ఓటీ బృందం. మూడు కార్లల్లో కొకైన్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి, జుబ్లిహిల్స్‌ లోని అనురాధ, ప్రభాకర్ రెడ్డి, సాయి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో దాచిన 51.45 గ్రాముల కొకైన్, 44 MDMA, 8 గ్రాముల పిల్స్ గుర్తించారు.

వారి వద్ద 5 మొబైల్ ఫోన్లు, 97 వేల రూపాయల నగదు సీజ్ చేశారు. మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలలో డ్రగ్స్ సేవిస్తున్న సంపన్న వర్గాలు. డ్రగ్స్ ఎవరెవరు సేవిస్తున్నారు అనే సమాచారాన్ని స్వేకరిస్తున్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్ మత్తులో జోగుతున్న సంపన్న వర్గాలు. వీళ్లు మాత్రమే డ్రగ్స్ సేవిస్తున్నారా? డ్రగ్స్‌ను ఎవరికైనా విక్రయిస్తున్నారా? లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పలువురు డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించారు. వారిని గుర్తించే పనిలో పడ్డారు కాప్స్. వారిని కూడా అరెస్టు చేస్తాం. అందరిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం అని DCP జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లాలో మోకిలలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 52 గ్రాముల కోకైన్, 45 LSD పిల్స్, 8 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. మోకిల వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్ఓటీ బృందం. ఓ లేడి కిలాడీతో పాటు ఇద్దరు అరెస్టు అయ్యారు.NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మూడు కార్లు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు