Tiger Nageswara Rao Review: గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా?

గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర్రావు. రవితేజ హీరోగా వంశీ ఆకెళ్ళ తీసిన ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా మీ అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి వీటిని ఈ సినిమా అందుకుందా...ట్రైగర్ నాగేశ్వర్రావుగా రవితేజ హిట్ కొట్టాడా? ప్రేక్షకులకు ఈ సినిమా దసరా వినోదాన్ని అందించిందా లేదా? టైగర్ నాగేశ్వర్రావు మూవీ రివ్యూ.

New Update
Tiger Nageswara Rao Review: గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా?

Tiger Nageswara Rao Review in Telugu: దొంగతనాలకు ఫేమస్ స్టువర్టుపురంలో ఒక గజదొంగ నాగేశ్వర్రావు. ఎనిమిదేళ్ళ వయసులో తండ్రిని చంపి టీనేజ్ కు దొంగగా మారతాడు. భారీ దొంగతనాలతో తమకు సవాలుగా మారిన నాగేశ్వరరావును పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించవు. చివరికి ఒక భారీ దొంగతనం కేసులో పోలీసులు అతణ్ని మద్రాస్ జైల్లో పెడితే.. అక్కడ్నుంచి కూడా తప్పించుకుంటాడు. టైగర్ నాగేశ్వరరావు గురించి ఒక దశలో ప్రధానమంత్రి భద్రతాధికారి సైతం కంగారు పడే పరిస్థితి వస్తుంది. అతను నాగేశ్వరరావు గురించి తెలుసుకోవడానికి స్టువర్టుపురం వస్తాడు. అక్కడ నాగేశ్వరరావులో తెలియని కోణాలన్నీ బయటపడతాయి. ఆ కోణాలేంటి.. అసలు నాగేశ్వరరావు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు.. దోచుకున్న డబ్బంతా ఏం చేస్తున్నాడు.. టైగర్ నాగేశ్వర్రావు ఎందుకు ఫేమస్ అయ్యాడు అన్నదే కథ.

బయోపిక్స్ సినిమాలు పెద్దగా హిట్ కావు. వాటికి టాక్ మంచిగా వస్తే రావొచ్చును కానీ కమర్షియల్ గా హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువే. సినిమాల్లో ఉన్న డ్రామా నిజజీవితంలో ఉండదు. అలాంటి వాటిని సినిమాగా తీస్తే కొంత గ్లోరిఫై చేయాల్సి ఉంటుంది. కానీ మళ్ళీ అది మరీ ఎక్కువైతే కూడా జనాలు ఆక్సెప్ట్ చేయరు. అందుకే బయోపిక్స్ తీసేవారికి అది కత్తిమీద సాములాంటిదే. క్యారెక్టర్ని ఎలివేట్ చేసేందుకు ఎగ్జాజరేషన్లు.. గ్లోరిఫికేషన్లు ఎక్కువైతేనే ప్రమాదం. అప్పుడది బయోపిక్ అంటే నమ్మబుద్ధి కాదు. సైరా లాంటి సినిమాలు అసంతృప్తి మిగల్చడానికి, ఏమాత్రం వాస్తవ కథల్లా అనిపించకపోవడమే కారణం. టైగర్ నాగేశ్వరరావు కూడా దాదాపుగా ఆ కోవకు చెందినదే.

గజదొంగ నాగేశ్వరరావును.. టైగర్గా ఎలివేట్ చేసే క్రమంలో ఎగ్జాజరేషన్లు హద్దులు దాటిపోయాయి. అలాగే నాగేశ్వరరావు చేసిన ప్రతి పనికీ జస్టిఫికేషన్ ఇవ్వాలని చూసే క్రమంలో దీన్ని వాస్తవ కథగా అస్సలు చూడలేము. కొంతవరకు ఎగ్జైటింగ్ గా టైగర్ నాగేశ్వరరావు బాగుంది అనిపిస్తుంది కానీ తర్వాత ఈ ఎగ్జాజరేషన్లు.. జస్టిఫికేషన్లు.. హద్దులు దాటిన వయొలెన్స్.. దానికి తోడు సినిమా లెంగ్తీగా అయిపోవడంతో బోర్ కొడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే హీరో వీర విధ్వంసం చేస్తాడు. కత్తి పట్టి.. కాళ్లు.. చేతులు.. తలలు తెంచుకుంటూ వెళ్లిపోతాడు. ఒక రౌడీ మీదికి కత్తితో దూసుకెళ్తే.. శరీర భాగాలు ఎగిరి చెల్లాచెదురుగా పడతాయి. ఈ రోజుల్లో బోయపాటి శ్రీను తీసే ఊర మాస్ సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు పెడితేనే ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అలాంటిది ఒక బయోపిక్ లో ఇలాంటి సీన్ పెట్టి ఎలా జస్టిఫై చేయొచ్చని దర్శకుడు అనుకున్నాడో మరి.

Also Read:ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్

అదేదో సినిమాలో చెప్పినట్టు పార్ట్‌లు పార్ట్‌లుగా చూస్తే బాగుంది అన్నట్టు టైగర్ నాగేశ్వర్రావు (Tiger Nageswara Rao) సినిమా కూడా పార్ట్‌లుగా చూస్తే బావుంది అనిపించొచ్చు కానీ మొత్తం సినిమాగా మాత్రం భరించడం కష్టం. ఒక కల్పిత కథలో ఇలాంటి సీన్లు ఎన్ని పెట్టినా ఓకే కానీ.. వాస్తవ కథలో అవి ఇమడలేదు. అదే టైగర్ నాగేశ్వరరావుకు పెద్ద సమస్యగా మారింది. స్టువర్టుపురం దొంగలకు అడ్డాగా మారడం వెనుక ఉన్న నేపథ్యం.. అలాగే టైగర్ నాగేశ్వరావు ఎలా గజదొంగ అయ్యాడు అనే విషయాలను ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు.

నాగేశ్వరరావు చేసిన తొలి హత్య తండ్రిదే.. అది కూడా ఎనిమిదేళ్ల వయసులో అంటూ అతనెంత క్రూరుడో చూపించే సన్నివేశం ఆ పాత్రకు బలమైన పునాది వేస్తుంది. ఇక రైలు దోపిడీతో హీరోను పరిచయం చేసే సన్నివేశం కూడా ఆ పాత్రకు మంచి ఎలివేషనే ఇస్తుంది. నాగేశ్వరరావు ఎదుగుదలను కూడా బాగానే చూపించారు. అసాధ్యం అనుకున్న పనులను నాగేశ్వరరావు ఎలా చేశాడా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఒక్కో ఎపిసోడ్ ఇంట్రస్టింగ్‌గా చూస్తారు.హీరో పాత్రలో గ్రే షేడ్స్ ఒక రియలిస్టిక్ మూవీ చూస్తున్న భావన కలిగిస్తాయి. ఇక నాగేశ్వరరావు పేరు వెనుక 'టైగర్' ఎలా చేరిందో చూపిస్తూ తీసిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధం అయ్యేసరికి 'టైగర్' మంచి హై ఇస్తాడు. కానీ ఇదే టెంపోలో సెకండాఫ్ కూడా నడిస్తే సినిమా ఒక స్థాయిలో నిలబడేది.

కానీ సెకండ్ హాఫ్ మాత్రం మూవీకి పెద్ద మైనస్. ఒక దొంగను మహానుభావుడిగా చూపించాలని అనుకోవడం కరెక్ట్ గా అనిపించదు. ఏదొ ఒక మంచి కోణం ఉందని చూపిస్తే ఓకే కానీ మొత్తానికే గొప్పవాడు అంటూ ప్రొజెక్ట్ చేయడం క్షవర్ గా అనిపిస్తుంది. ప్రధానమంత్రి ఇంట్లోకి జొరబడి తాను అనుకున్నది చేయడమే అతి అంటే.. చివరికి ప్రధాని పాత్రతోనే అతడికి ఎలివేషన్ ఇప్పించడం అన్నది టూమచ్. దానికి తోడు మితిమీరిన హింస జుగుప్స కలిగిస్తుంది. మూవీలో లవ్ ట్రాక్ కూడా దానికి మైనస్ అయిందే తప్ప ఎందుకూ సహాయపడలేదు. బాగా మొదలుపెట్టి క్లైమాక్స్ ను పాడు చేశాడు దర్శకుడు. అయితే రవితేజకు (Ravi Teja) మాత్రం ఇది మంచి సినిమా అవుతుంది కచ్చితంగా. ఈ పాత్రలో మాస్ రాజా బలమైన ముద్ర వేశాడు. చాన్నాళ్ల తర్వాత రవితేజ నుంచి ఒక ఇంటెన్స్ పెర్ఫామెన్స్ చూడొచ్చిందులో. నాగేశ్వరరావు రూపంతో రవితేజకు పోలిక లేకపోయినా.. తన పెర్ఫామెన్స్ తో ఆ పాత్రలో తనను చూసి ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చేయగలిగాడు. మాస్ రాజా పెర్ఫామెన్స్ కోసం ఒకసారి ఈ సినిమా చూడొచ్చు. హీరోయిన్లలో నుపుర్ సనన్ (Nupur Sanon) తేలిపోయింది. ఆమె పాత్ర.. తన అప్పీయరెన్స్ ఈ సినిమాకు సూట్ కాలేదు. మరో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ (Gayatri Bharadwaj) పర్వాలేదు. తన పాత్ర కూడా ఏమంత గొప్పగా లేదు. నాజర్ నటనలో రాణించాడు కానీ.. తన గెటప్ తేలిపోయింది. హరీష్ పేరడి కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. జిషు సేన్ గుప్తా బాగా చేశాడు. పాటలు చాలా మామూలుగా ఉన్నాయి. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందించాడంటే నమ్మబుద్ధి కాదు. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. మిగతావన్నీ కూడా సోసోగా అనిపించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు