Youngest MLAs: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో ముగ్గురు తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ నుంచి గెలిచినడాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నియోజకవర్గం నుంచి ప‌ర్ణిక రెడ్డితో పాటు పాలకుర్తి నుంచి గెలిచిన యశస్విని రెడ్డి ఉన్నారు.

New Update
Youngest MLAs: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ నయా జోష్‌లో ఉంది.డిసెంబర్ 7న తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. తన మార్కు పాలన మెుదలుపెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత వివిధశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేల గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగానే యశస్వినే హాట్ టాపిక్:
పాలకుర్తి నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన యశస్విని రెడ్డి(Yashaswini Reddy) వయసు 26. ముప్పై ఏళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Erraballi Dayakar rao)పై సుమారు 14వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన యశస్విని రెడ్డి .. వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని యశస్విని రెడ్డి అనూహ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన యశస్విని విద్యాబ్యాసం అంతా హైదరాబాద్‌లోనే . యశస్విని వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్నారు. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబం అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తన అత్తఝాన్సీరెడ్డికి టికెట్ ఖాయమవడం . ఆమెకు భారత పౌరసత్వం విషయంలో చిక్కులు రావడంతో ఝాన్సీ రెడ్డికి బదులుగా ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఖాయం చేసింది. అయితే .. యశస్వినీ రెడ్డి గెలుపుపై కాంగ్రెస్ వర్గాల్లో ఎన్నో అనుమాలున్నా సరే .. వాటన్నిటిని పటాపంచలు చేసి అనూహ్యరీతిలో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై సంచలనం విజయం సాధించి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

డీకే అరుణ ఫ్యామిలిని పర్ణికరెడ్డి:

ఇక.. ఈ కోవలోకే వచ్చిన మరో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి(Parnika Reddy). నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై దాదాపు 8 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు చిట్టెం పర్ణికా రెడ్డి ఆమె వయసు 30ఏళ్ళు. 2016లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఆగస్ట్ 15 రోజున జెండా ఆవిష్కరణ చేసిన తరువాత మావోయిస్టులు జరిపిన కాల్పులలో నర్సిరెడ్డి, ఆయన రెండో కుమారుడు, ప‌ర్ణిక రెడ్డి తండ్రి అయిన వెంకటేశ్వరరెడ్డి చనిపోయారు.తండ్రి చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి పీసీసీ సభ్యుడిగా పని చేశారు.పర్ణికా రెడ్డి ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ చేస్తున్నారు. ఇక్క‌డ ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ ప‌ర్ణిక రెడ్డికి మేన‌త్త అవుతారు.

లండన్‌ టు మెదక్:
ఇక.. కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్(Mainampally Rohit). మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పద్మా దేవేందర్ రెడ్డిపై సుమారు 9 వేల ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. రోహిత్ వయసు 26. మైనంపల్లి హన్మంతరావు కుమారుడే ఈయన. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మైనంపల్లి హన్మంతరావు .. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రోహిత్ రావు మేడ్చల్లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

Also Read: ‘అది నా హక్కు…’ కోహ్లీతో గొడవ..! గంభీర్‌ అసలు తగ్గట్లేదుగా!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు