komuram Bheem District:హమ్మయ్య ఆ పులులు సేఫ్..

కాగజ్‌ నగర్‌లో పులల వేట కథ సుఖాంతం అయింది. కొన్ని రోజుల క్రితం రెండు పులుల విషప్రయోగంతో చనిపోయాయి. ఈ నేపథ్యంలో మిగతా పులల సెర్చ ఆపరేషన్‌ను అటవీశాఖ సీరియస్‌గా తీసుకుంది. చివరకు తల్లి పులి, రెండు పిల్ల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్‌ను నిలిపేసింది.

New Update
Cheetah : తిరుమలలో చిరుత పులి కలకలం.. అలర్ట్ అయిన టీటీడీ..!

Darigam Forest:కొమురం భీం జిల్లా కాగజ్‌ గర్‌ రేంజ్‌ దరిగాం అడవిలో టైగర్ సెర్చ ఆపరేషన్ విజయవంతంగా ముగిపింది. మూడు రోజులు విస్తృత గాలింపు తర్వాత కనిపించకుండా పోయిన పులులు ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అటవీశాఖా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. S6 పులి దాని రెండు పిల్లలు అడవిలో క్షేమంగా ఉన్నాయి. అంతకు ముందు దరిగాం అడవిలో విష ప్రయోగంగతో రెండు పులులు చనిపోగా మరో రెండు పులులు మిస్ అయ్యాయని అధికారులు భావించారు. దీంతో మొత్తం అటవీశాఖ అంతా అడవిని జల్లెడ పట్టింది. మూడు వందల మంది సిబ్బందిని రంగంగలోకి దింపింది. 72 బృందాలు, 105 ట్రాప్ కెమెరాలతో మూడు రోజుల పాటూ అడవిని అణువణువూ గాలించారు. మూడు రోజుల తర్వాత ట్రాప్ కెమెరాలకు తల్లి పులి, రెండు పిల్లలు కనిపించడంతో ఆపరేషన్‌ను ముగించారు.

Also Read:అమెరికాలో మంచు తుఫాను..2000 విమానాలు రద్దు

ఈ నెల 9న టైగర్ ఎస్క్యూ ప్రారంభించింది అటవీశాఖ. మొదటి రోజు 14, ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో సెర్చింగ్ ఆపరేషన్ చేశారు. ఒకరోజంతా వెతికినా ఫలితం కనిపించకపోవడంతో ట్రాకింగ్ టీమ్‌ను పెంచింది. అంతేకాదు కెమెరాలను సైతం పెంచి మరింత విస్తృతంగా అడవంతా గాలించింది.

అంతకు ముందు కుమురం భీం ఆసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లాలో పులులు(Tigers) మృతి కలకలం రేపింది. మొదట ఒక పులి చనిపోగా…మరో రెండు రోజులకు మళ్ళీ ఇంకో పులి మృతి చెందింది. కాగజ్ నగర్ టైగర్ రిజర్వాయర్‌లో ఇది జరిగింది. దరిగాం అటవీ ప్రాంతంలో మృతి చెందిన పులులను గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో సీసీఎఫ్ శాంతా రాం, అటవీశాఖ అధికారులతో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మొదట పులులు టెరిటోరియల్ ఫైట్ కారణంగా చనిపోయాయని అనుకున్నారు. కానీ రెండు పులి చనిపోయిందని గుర్తించాక అలసు కారణం తెలిసింది. పైగా రెండు పులుల చనిపోయిన ప్రాంతం ఒకటే కావడం కూడా ఇందుకు కారణం అయింది. పులులు చనిపోయిన ప్రదేశానికి దగ్గరలోనే ఒక ఆవు శవాన్ని కూడా అధికారులు గుర్తించారు. దాని మీద వాలిన ఈగలు కూడా చనిపోయి ఉండడంతో...ఆ ఆవును తినే పులులు చనిపోయాయని అటవీ అధికారులు నిర్ణయించారు. చనిపోయిన ఆవు విషంగా మారిందని...అందువల్లే పులుల చనిపోయాయని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు