పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఎక్కడంటే.!

పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ వర్షానికి కూలీలు చెట్ల కిందకు వెళ్లడంతో చెట్లపై పిడుగు పడింది. దీంతో కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

New Update
పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఎక్కడంటే.!

పిడుగు పాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని దామెరకుంట చెందిన గూడూరు రాజేశ్వర్‌రావు అనే రైతు తన పొలంలో కలుపు తీయడానికి వెళ్లాడు. అప్పటి వరకు ముసురుగా ఉన్న వాన ఒక్కసాగా భారీ వర్షం కురువడంతో రైతు చెట్టు కిందకు వెళ్ళాడు. భారీ వర్షానికి తలదాచుకుందామని చెట్టుకిందకు వెళ్లిన రైతుపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు చిట్యాల మండలం కైలాపూర్‌లో మిరప నారు నాటేందుకు వెళ్లిన ఇద్దరు కూలీలు మృతి చెందారు.

మిరప నారు నాటుతుండగా.. నల్లగా దట్టంగా వ్యాపించిన మేఘాలతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షం కువరడంతో సరిత (30), మమత(32) ఇద్దరు పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

అంతే కాకుండా రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. భారీ వర్షం పడుతున్న సమయంలో రైతులు కానీ, గ్రామస్తులు కానీ చెట్ల కిందకు వెళ్లవద్దని సూచించారు. చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వర్షం వస్తే చెట్ల కిందకు వెళ్లే బదులు పొలం సమీపంలో ఉండే షెడ్డు కిందకు వెళ్లాలని తెలిపారు. రైతులు వాతావరణ శాఖ అధికారుల సూచనలు పట్టించుకోకపోవడంతో వారి ప్రాణాలు వారే తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు