రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం..133 ఏళ్ల కిందటి నీళ్లట్యాంకు కూలి

పశ్చిమబెంగాల్‌ లోని బర్ధమాన్‌ రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషనులో నిర్మించిన133 ఏళ్ల కిందటి పురాతనమైన మెటల్ వాటర్ ట్యాంకు కూలిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. 30 మందికిపైగా గాయాలయ్యాయి. రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేశారు.

New Update
రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం..133 ఏళ్ల కిందటి నీళ్లట్యాంకు కూలి

Burdwan Railway Station: రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్లాట్‌ఫాం మీద వేచివున్న ప్రయాణికులను ఊహించని రీతిలో మృత్యువు వెంటాడింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అప్పటిదాకా జనాలతో కిటకిటలాడుతున్న ఆ రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకోవడంతో జనాలు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది.

అసలు విషయానికొస్తే.. పశ్చిమబెంగాల్‌ రాజధాని నగరమైన కోల్‌కతాకు (Kolkata) సమీపంలోని బర్ధమాన్‌ రైల్వేస్టేషనులో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బర్ధమాన్‌ రైల్వేస్టేషనులో నిర్మించిన133 ఏళ్ల కిందటి పురాతనమైన నీళ్లట్యాంకు పాక్షికంగా కూలిపోయింది. అయితే అదే సమయానికి ముగ్గురు ప్రయాణికులు దానికింద నిలబడి ఉండటంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే నీళ్లతో నిండి ఉన్న మెటల్‌ ట్యాంకులోని వాటర్ మొత్తం ఒక్కసారిగా ప్రయాణికులు వేచి ఉన్న ప్లాట్‌ఫాం షెడ్డుపైకి పడటంతో దానికింద ఉన్న 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన తూర్పు రైల్వేశాఖ 1, 2, 3 ప్లాట్‌ఫాంలపై రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేసింది. పాతబడిన నీళ్ల ట్యాంక్ ఇన్నాళ్లుగా ఎందుకు మార్చలేదని, రైల్వే అధికారుల పనితీరు సరిగాలేకపోవడంతోనే ప్రమాదాలు పెరిగిపోయాయంటూ అక్కడున్న స్థానికులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు