Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్

లోక్ సభ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొని కాంగ్రెస్‌లో చేరారు. తాజా రాజకీయ పరిణామాలతో హర్యానా బీజేపీ సర్కార్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

New Update
Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్

3 Independent MLAs Withdraw Support to BJP: లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి హర్యానాలో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ సంక్షోభంలో కూరుకుపోయింది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.. సోంబీర్ సాంగ్వాన్, రణధీర్ గొల్లెం, ధర్మపాల్ గొండర్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు. తాజా పరిణామాలతో బీజేపీ సర్కార్ మైనారిటీలో ఉంది.

ALSO READ: ఎన్నికల వేళ చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఇదిలా ఉంటే.. హర్యానాలోని 90 మంది సభ్యుల సభలో సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి 40 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆరుగురు ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. దీంతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఆరుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని.. ఒకవేళ ఇదే జరిగితే బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ధరమ్ పాల్ గోంధర్ మాట్లాడుతూ, " గతంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మా మద్దతు అవసరమైన సమయంలో మమ్మల్ని మళ్లీ మళ్లీ పిలిచారు... మనోహర్‌లాల్ ఖట్టర్ అధికారంలో ఉన్నంత వరకు మేము మద్దతు ఇస్తామని నిర్ణయించుకున్నాము. ఆయన అధికారంలో లేరని బాధగా ఉంది.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేము ప్రభుత్వం నుండి మద్దతును ఉపసంహరించుకుంటాము" అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు