Razakar: 'రజాకార్' చిత్ర నిర్మాతకు బెదిరింపు కాల్స్.. ముస్లింలకు వ్యతిరేకంగా తీశారంటూ! 'రజాకార్' సినిమా చిత్ర నిర్మాత గూడూరు నారాయణ బెదిరింపు కాల్స్ వస్తు్న్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కేంద్ర హోం శాఖకు తెలిపారు. దీంతో కేంద్రం 1+1 సీఆర్పీఎఫ్ జవాన్‌లతో సెక్యూరిటీ నియమించడం చర్చనీయాంశమైంది. By srinivas 21 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Threatening Calls to Razakar Movie Producer: 'రజాకార్' సినిమా నిర్మాత, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణకు (Guduru Narayana) బెదిరింపు కాల్స్ వస్తు్న్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ సినిమా విడుదల కావటం సర్వత్రా చర్చనీయాశంగా మారిన విషయం తెలిసిందే. కాగా కొన్ని వర్గాలు సినిమా కథను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించిన బాధలు, ఉద్యమాలను కళ్లకు కట్టినట్టు చూపించగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. ముస్లింలకు వ్యతిరేకంగా తీసిన సినిమాగా వివదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కూడా చదవండి: India: ప్రధానిపై రాళ్ల దాడి.. ముక్కు పగిలి రక్తం చిమ్మినా ఆగని ప్రసంగం! 1+1 సీఆర్పీఎఫ్ జవాన్‌లతో సెక్యూరిటీ.. ఈ క్రమంలోనే గూడూరు నారాయణకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఇప్పటివరకు దాదాపు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ.. నారాయణకు 1+1 సీఆర్పీఎఫ్ జవాన్‌లతో సెక్యూరిటీ నియమించింది. దీంతో ఒక సినీ నిర్మాతకు కేంద్రం సెక్యూరిటీని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రముఖ నటి ఇంద్రజ, యాంకర్ అనసూయ (Anchor Anasuya) కీలక పాత్రలో నటించగా యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమా కాదు.. అది మన చరిత్ర.. ఇక ఈనెల 15వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి రోజురోజుకి స్పందన పెరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రజాకార్ అనే చిత్రం కమర్షియల్ సినిమా కాదని ఇది మన చరిత్రను తెలియజేసే చిత్రమని పేర్కొన్నారు. ఆ రోజుల్లో హిందువులపై రజాకార్లు చేసిన దాడులు, ఆకృత్యాలు, మత మార్పిడులు జరిగిన తీరు నేటి తరం యువత తెలుసుకోవాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలు కూడా ఈ చిత్రం ఒక పుస్తకంలా ఉపయోగపడుతుందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరో నలుగురి తీసుకెళ్లి మన తాతలు, ముత్తాతలు పడిన బాధలను చూపించాలని కోరారు. రజాకార్లు అంటే ఎవరో తెలియని వారు, నేటి తరం యువత తప్పక చూడాల్సిన చిత్రమని తెలిపారు. #razakar-movie #threatening-calls #guduru-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి