Nuzividu Triple IT: ట్రిపుల్‌ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

నూజివీడు ట్రిపుల్ ఐటీ లో గత నాలుగు రోజులుగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు.

Nuzividu Triple IT: ట్రిపుల్‌ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!
New Update

Nuzividu: నూజివీడు ట్రిపుల్ ఐటీ లో పరిశుభ్రత పడకేసింది. నాసిరకం ఆహారం తిన్న విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. గత వారం రోజుల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాసిరకం ఆహారం తినడం వల్ల విద్యార్థులంతా కూడా వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

విద్యార్థులు ఇన్ని అవస్థలు పడుతున్నప్పటికీ ట్రిపుల్ ఐటీ యజమాన్యం మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే ప్రాంగణంలో శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీని కూడా నిర్వహిస్తున్నారు. రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు.

గత నాలుగు రోజులుగా అస్వస్థతకు గురౌతున్న విద్యార్థులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైతే యాజమాన్యం మాత్రం కేవలం 400 మంది విద్యార్థులను మాత్రమే లెక్కల్లో చూపుతున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కూడా ప్రాంగణంలోని మెస్‌ లను పరిశీలించడానికి వెళ్లలేదని సమాచారం.

ఈ విషయం తెలిసిన మంత్రి లోకేశ్‌ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థులు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అంటూ ట్విట్టర్లో తెలిపారు.

దీంతో అధికారులు స్పందంచారు. డీఎంహెచ్‌వో షర్మిష్ఠ ట్రిపుల్‌ ఐటీ మెస్‌లు, ఆసుపత్రిని సందర్శించారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి ఉన్నతాధికారులు నివేదిక ఇస్తామని తెలిపారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న వెంటనే రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీని సందర్శించారు. ముందుగా ప్రాంగణంలో ఉన్న ఫుడ్‌ కోర్టును పరిశీలించారు. నిల్వ మాంసం, బూజు పట్టిన ఆహార పదార్థాలు గుర్తించి నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి రిజిస్ట్రార్‌ తో ఆయన మాట్లాడి విద్యార్థులు అనారోగ్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. విద్యార్థుల వైద్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డేట్ కు ‘రాజా సాబ్’ టీజర్

#iiit #ill #nuzivid
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe