Raja Saab Teaser : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డేట్ కు 'రాజా సాబ్' టీజర్

'రాజా సాబ్' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23 న 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఫ్యాన్స్ కోసం టీజర్ ను బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

New Update
Raja Saab Teaser : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డేట్ కు 'రాజా సాబ్' టీజర్

Prabhas Raja Saab Teaser : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ లో రొమాంటిక్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్‌ తన షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేశారు. తాజా షెడ్యూల్‌లో ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.

Also Read : ‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ టాక్.. పోతారు.. మొత్తం పోతారు

దాని ప్రకారం.. ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23 న 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ కోసం టీజర్ ను బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వనుందట 'రాజా సాబ్' టీమ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisment
తాజా కథనాలు