AP Pension : చంద్రబాబు సంచలనం.. వారికి పెన్షన్ రూ.10 వేలు!

AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మూడో సంతకం పెన్షన్ల పెంపు ఫైల్‌పై పెట్టారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి రానుంది. జులై 1న వృద్ధులకు రూ.7 వేలు, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి రూ.10 వేల ఫించన్‌ అందించనున్నారు.

New Update
AP Pension : చంద్రబాబు సంచలనం.. వారికి పెన్షన్ రూ.10 వేలు!

CM Chandrababu About Pension : ఫించన్‌దారులపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) వరాల జల్లు కురిపించారు. సామాజిక భద్రత ఫించన్ల పెంపు ఫైల్‌ పై మూడో సంతకం చేశారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ (YSR Pension) కానుక పథకం పేరును ఎన్టీఆర్‌ భరోసా (NTR Bharosa) గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై వృద్ధులకు రూ.4వేల పెన్షన్‌ అందనుంది. ఏప్రిల్‌ నుంచి పెంచిన పెన్షన్‌ అమలు చేయనుంది చంద్రబాబు సర్కార్. జులై 1న వృద్ధులకు 7 వేల రూపాయలు అందించనున్నారు.

ఇక నుంచి దివ్యాంగులకు రూ. 6 వేల ఫించన్‌ ఇవ్వనున్నారు. అనారోగ్యంతో మంచం పట్టిన వారికి రూ.10 వేల ఫించన్‌ అందనుంది. ఏపీలో 65.39 లక్షల మంది ఫించన్‌దారులు ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 4వేలకు పెంపుతో నెలకు రూ.2758 కోట్ల వ్యయం పడనుంది. ఏడాదికి రూ.33వేల కోట్లకు ఫైగా ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు.

Also Read : రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

Advertisment
తాజా కథనాలు