OTT Releases : ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్ సిరీస్ లు ఇవే..!

ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. వీటిలో ఆడు జీవితం, బహిష్కరణ, హరోం హర వంటి సినిమాలు ఆడియన్స్ దృష్టిని ఆకర్శించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం 15 కు పైగా చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

OTT Releases : ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్ సిరీస్ లు ఇవే..!
New Update

This Week OTT Releases : ఓటీటీ ప్రియులను అలరించేందుకు అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. ఆ చిత్రాలు, సీరీస్ ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆడు జీవితం

మలయాళీ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లీడ్ రోల్ ప్లే చేసిన 'ఆడు జీవితం (The Goat Life) మార్చ్ లో థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

బహిష్కరణ

ముఖేష్‌ ప్రజాపతి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్‌ థ్రిల్లింగ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంజలి వేశ్య పాత్ర పోషించింది. ఇప్పటికే ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ జులై 19వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

హరోం హర

సుధీర్ బాబును ఊరమస్ అవతార్ లో చూపించిన సినిమా హరోం హర. జూన్‌ 14న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ.. 'ఈటీవీ విన్‌' స్ట్రీమింగ్‌ అవుతోంది. తొలుత జులై 11న ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా, టెక్నికల్‌ సమస్యల కారణంగా తాజాగా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.

నెట్‌ఫ్లిక్స్‌

  • త్రిభువన్‌ మిశ్రా సీఏ టాప్‌ర్‌ (హిందీ-సిరీస్‌) జులై 18
  • స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ - (ఇంగ్లిష్) జులై 19
  • ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లిష్) జులై 19

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మై స్పై ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లిష్‌) - ఆల్రెడీ స్ట్రీమింగ్

ఆహా

  • హాట్‍స్పాట్ (తెలుగు) - ఆల్రెడీ స్ట్రీమింగ్

జీ5

  • బర్జాఖ్ (హిందీ సిరీస్) జులై 19

డిస్నీ+ హాట్‍స్టార్

  • నాగేంద్రన్స్ హనీమూన్ - మలయాళ సిరీస్ జులై 19

ఈటీవీ విన్‌

  • మ్యూజిక్‌ షాపు మూర్తి (తెలుగు)- ఆల్రెడీ స్ట్రీమింగ్

జియో సినిమా

  • హరోం హర (హిందీ) జులై 18
#aadu-jeevitham #bahishkarana #this-week-ott-releases
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe