Train Charges: ఈసారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు చార్జీలు వసూలు లేదు సంక్రాంతి స్పెషల్ రైలులో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణ రైలులో మాత్రం రెగ్యులర్ ఛార్జీలు ఉంటాయని సీపీఆర్వో తెలిపారు. ఈ సారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు ఛార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు. By Bhavana 08 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Sankranthi Trains: సంక్రాంతి (Sankranthi) రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకం గా 115 స్పెషల్ రైళ్లను (Special Trains) ఏర్పాటు చేసింది. తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్స్ నుంచి ఈ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో (CPRO) రాకేష్ వివరించారు. ఈ నెల 7 నుంచి 20 వ తేదీ వరకు సౌత్ సెంట్రల్ పరిధిలో ఈ రైళ్లను నడపనున్నట్లు రాకేష్ తెలిపారు. అదనపు ఛార్జీలు.. ప్రత్యేక రైలు సర్వీసులు జనవరి చివరి వారం వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. సంక్రాంతి స్పెషల్ రైలులో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణ రైలులో మాత్రం రెగ్యులర్ ఛార్జీలు ఉంటాయని సీపీఆర్వో తెలిపారు. ఈ సారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు ఛార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు. ఈ సంక్రాంతికి వందే భారత్ రైలు కూడా... కేవలం రైలులో ప్రయాణించే వారు మాత్రమే స్టేషన్ దగ్గరకు రావాలని ఆయన అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు నగరు శివారు ప్రాంతాల రైల్వే స్టేషన్ల నుంచి సంక్రాంతి స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ సంక్రాంతికి వందే భారత్ రైలు సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని రాకేష్ పేర్కొన్నారు. ఏపీ విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, నర్సాపూర్, తిరుపతి వంటి ప్రధాన రూట్లలో ఫెస్టివల్ డిమాండ్ ను బట్టి అదనపు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎంటీఎస్ వెబ్ సైట్, యూటీస్ మొబైల్ యాప్ ద్వారా ట్రైన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. సికింద్రాబాద్ మెయిన్ జంక్షన్ లో పండగ సందర్బంగా అడిషనల్ స్టాఫ్ తో సెక్యూరిటీ పెంచుతూ మోనిటర్ చేస్తామని వివరించారు. Also read: రాత్రి సమయంలో అయోధ్య రామ మందిర అందాలు చూడతరమా! #train #scr #sankranthi #cpro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి