Argemone Mexicana Flower : మన చుట్టూ ఉండే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేదం గుణాలున్నాయి. అవి చూడటానికి పిచ్చి మొక్క అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వాటి వేర్లు, పూలు, ఆకులు, మొక్కలు వలన చాలా ఉపయోగాలున్నాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో సత్యనాశి మొక్క(Argemone Mexicana Flower) ఒకటి. సత్యనాశి అనే పేరు వినగానే చాలామంది అది చెడు చేస్తుందని అనుకుంటారు. అయితే.. పురాతన వైద్యంలో దీనిని అద్భుత మొక్కగా పిలిచేవారు. ఈ మొక్క పువ్వులు, ఆకులు శరీరంలోని అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంతేకాదు సత్యనాశి మొక్క పురుషులకు ఒక వరం. వీటిని ఉపయోగించి వారు ప్రతి సీజన్‌లో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శారీరక బలహీనతలను కూడా వదిలించుకోగలడని ఆయుర్వేదం వైద్య నిపుణులు అంటున్నారు. ఈ మొక్క పురుష(Man) బలహీనతను తొలగించడానికి, మధుమేహం, కామెర్లు, కడుపు నొప్పి, దగ్గు, మూత్ర సమస్యలతో సహా కొద్దీ వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఈ మొక్క హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. భారత్ అంతటా రోడ్ల వెంట పొడి ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఈ మొక్కలో ఎక్కువ ముళ్ళు ఉంటాయి. దాని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. పువ్వుల లోపల ముదురు రంగు విత్తనాలున్నాయి. సత్యనాశిని స్వర్ణక్షిరి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దానిని పగలగొట్టినప్పుడు పసుపు రంగు పాలు వస్తుంది.ఈ మొక్కలో మైక్రోబయల్, డయాబెటిక్, ఇన్‌ఫమేటరీ, స్పాస్మోడిక్, అనాల్జేసిక్, యాంటీ ఆక్సిడెంట్ లాంటి గుణాలున్నాయి. ఆయుర్వేదంలో సత్యనాశి పాలు, ఆకు రసం, విత్తన నూనె, ఆకు ముద్దను అనేక రోగాలకు ఉపయోగిస్తారు. ఈ మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వ్యాధులకు ప్రయోజనకరంగా..
దగ్గు: దీర్ఘకాలిక దగ్గును నయం చేయడంలో సత్యనాశి మొక్కఒకటి. అందుకోసం ఈ మొక్క వేర్లను నీటిలో వేసి మరిగించి కషాయాలను తయారు చేసి ఉదయం, సాయంత్రం తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
మూత్ర సమస్య: మూత్ర విసర్జన సమస్యలు, మంట వంటి ఉంటే సత్యనాశి మొక్కను కషాయం చేసి త్రాగాలి. దీన్ని తాగితే మూత్ర సమస్యలు దూరమవుతాయి.
మధుమేహం: సత్యనాశి మొక్క రక్తంలో చక్కెర స్థాయిని(Diabetes) నియంత్రించడానికి పనిచేస్తుంది. దీనికోసం దాని ఆకులను ఉపయోగించవచ్చు.
చర్మాన్ని మెరుగుపరచడానికి: సత్యనాశి మొక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై అన్ని బ్యాక్టీరియా సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
కామెర్లు: సత్యనాశి మొక్క కామెర్లు వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దివ్యౌషధం. కామెర్లు ఉంటే గిలోయ్ రసాన్ని సత్యనాశి తైలంలో కలిపి సేవించాలి.
ఇది కూడా చదవండి: వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఉపయోగాలు.. ఎన్ని గ్లాసులు తాగాలి?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.