Vaikunta Ekadashi: నేడు ముక్కోటి ఏకాదశి..ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేది ఇందుకేనట..!!

హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండగలు చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.

New Update
Vaikunta Ekadashi: నేడు ముక్కోటి ఏకాదశి..ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేది ఇందుకేనట..!!

హిందూ సంప్రదాయంలో దాదాపు అన్ని పండగలను కూడా చాంద్రమానం ప్రకారమే జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తుంటారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు ముక్కోటి దేవతలకు వైకుంఠ ద్వారంలో శ్రీ మహావిష్ణువు తన దివ్యదర్శనం అనుగ్రహించిన పర్వదినం ఇది. అలా వైకుంఠ ఉత్తర ద్వారంలో ముక్కొటి దేవతలకు దర్శమిచ్చిన విష్ణుమూర్తి ఆమార్గంలోనే భూమిపై కి వచ్చాడని...మురాసురుడనే రాక్షసుడిని సంహరించాడని పురాణ కథనం చెబుతోంది. అందుకే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాల్లో భక్తులు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే సంప్రదాయం ఏర్పడింది.

ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుగాథలు , సంకీర్తనలు చేయాలి. ఆరోగ్యవంతులు ఉపవాస దీక్షలు చేయాలి. మనకు 5 కర్మేందియాలు, ఐదు జ్నానేంద్రియాలు ఆపై మనసును 11ఇంద్రియంగా పెద్దలు చెబుతుంటారు. ఈ ఏకాదశ ఇంద్రియాలు మంచి మార్గంలో ప్రవర్తించడం వైకుంఠ ఏకాదశి ముఖ్య ఉద్దేశం కావాలి. కుంఠం అంటే లోపం. లోపం లేకుండా ఉండటమంటే వికుంఠం.

అంటే సక్రమంగా వ్యవహరించడం, ఏకాదశ ఇంద్రియాలకు వికుంఠ స్థితిని ప్రసాదించే పర్వదినం వైకుంఠ ఏకాదశి. మనసు, ఇంద్రియాలు, వీటి ప్రవ్రుత్తలు కోటాను కోట్లు. ఆ మనసు సత్వ, రజ , స్తమో గుణాల ప్రకారం పనిచేస్తుంది. ఆ ప్రవ్రుత్తులను ముక్కోటి దేవతలుగా సంకేతరూపంలో సూచించారు. ఈ ప్రవ్రుత్తులన్నీ ఉత్తర ద్వారం వెంబడి ప్రయాణించడం అంటే యోగసాధన అర్థం. అలాయోగ సాధన సక్రమంగా సాగినవేళ కలిగే దివ్యానందమే గుండెలో కలిగే విష్ను దర్శనం. ఆనాడు జీవుడ మన ప్రవ్రుత్తులు ఉన్నమార్గం కన్నా ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అదే ఉత్ తర ద్వారా దర్శనం . ఈ అంతరార్థాన్ని గమనించి ప్రవర్తించిన వేళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం మొక్కబడిగా మిగిలిపోక సార్థకం అవుతుంది.

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత:
వైకుంఠ ఏకాదశికి హిందూ మతంలో గొప్ప మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు ఈ రోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శించి వేంకటేశ్వరుని ప్రార్ధనలు చేస్తారు. భక్తులు విష్ణువును పూజిస్తారు, ఉపవాసాలతో ఆలయాలను సందర్శిస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రజలు విష్ణు సహస్రనామాన్ని, శ్రీ హరి స్తోత్రాన్ని జపిస్తారు, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, అతని ఆశీర్వాదం కోసం. ఎవరైతే ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరిస్తారో వారు పూర్తి భక్తితో , అంకితభావంతో శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది నేరుగా వైకుంఠ ధామానికి వెళతారని నమ్ముతారు. వారు జనన మరణ చక్రం నుండి విజయవంతంగా విముక్తి పొందుతారని నమ్ముతారు.

ఇది కూడా చదవండి: ఊటీని తలపించే అందాలు..ఇక నుంచి మన హైదరాబాద్ లోనే..!

Advertisment
తాజా కథనాలు