Success Story : బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని..వజ్రం లాంటి కలను నెరవేర్చుకుంది..!! ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం. లక్షల్లో జీతం. ఈ జీవితానికి ఇంకేం కావాలి. అయినా కూడా హరిచందనకు ఏదో తెలియని వెలితి. ఐఏఎస్ కావాలన్న తన ఆశయం...ఉద్యోగానికి రాజీనామా చేయించి...సొంతగడ్డకు దారి చూపింది. ఇండియాకు వచ్చిన హరిచందన రెండవ ప్రయత్నంలోనే తన కల నెరవేర్చుకుంది. లక్షల్లో జీతాన్ని వదలుకుని తనలక్ష్యంవైపు అడుగులు వేసిన హరిచందన సక్సెస్ స్టోరీ గురించి తెలసుకుందాం. By Bhoomi 19 Aug 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి IAS Hari Chandana Success Story: ఐఏఎస్ కావాలనే కోరికతో దేశంలోని లక్షలాది మంది యువత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నేపథ్యానికి చెందినవారు. కొన్నిసార్లు, అందమైన ప్యాకేజీపై దేశంలో లేదా విదేశాలలో పనిచేస్తున్న యువతీయువకులు తమ ఉద్యోగాలను వదిలి ఈ పరీక్షకు హాజరవుతారు. ఈ రోజు సక్సెస్ స్టోరీ కాలమ్‌లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం లండన్ లో ఉద్యోగాన్ని విడిచి సొంతగడ్డకు తిరిగి వచ్చిన హరిచందన గురించి చెబుతున్నాము. ఈమె హరి చందన దాసరి. రెండో ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ కావాలనే తన కలను హరి చందనా నెరవేర్చుకుంది. హరిచందన ప్రయాణాన్ని ఓసారి పరిశీలిద్దాం. హరి చందన దాసరి. విద్యాభ్యాసం హైదరాబాద్ లో పూర్తయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పీజీ పట్టా పొందింది. పీజీ పట్టా తీసుకున్న తర్వాత తదుపరి చదువు విదేశాల్లో సాగింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కుపై ఉన్నత చదువులు చదివారు. చదువు పూర్తయ్యాక, హరి చందనకు లండన్‌లోనే ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత బీపీ సెయిల్‌లో పనిచేశారు. అయితే ఉద్యోగం చేస్తూనే దానిపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. నిజానికి, చందనా తండ్రి ఐఏఎస్ (IAS). తన తండ్రివలే తాను కూడా ఐఏఎస్ కావాలనుకుంది. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుంది. తన తండ్రిలాగే సామాజిక సేవచేయాలని కోరుకుంది. హరి చందన లండన్‌లో ఉద్యోగం వదిలేసి ఇండియాకి తిరిగొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC Civil Services Exam)కు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. సరైన వ్యూహం రచించుకుని... నోట్స్ తయారు చేసుకుంది. అయితే తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయింది. అయినా కూడా పట్టువదలలేదు. తొలి ప్రయత్నంలో విఫలమైనా హరి చందన తన లక్ష్యం నుంచి తప్పుకోలేదు. మొదటి ప్రయత్నంలో చేసిన తప్పులను సరిచేసుకుని రెండోసారి పరీక్షకు హాజరైంది. రెండో ప్రయత్నంలో పరీక్షలో విజయం సాధించింది. ఈ విధంగా తన కలను నెరవేర్చుకుంది. జీవితంలో చేసే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మన లక్ష్యాన్ని మనం ప్రేమించాలి. లక్ష్యాన్ని ప్రేమిస్తూ ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తే విజయం తప్పకుండా సొంతం అవుతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదల, అంకితభావంతో కష్టపడితే..ఏ పనిలోనైనా విజయం సాధించడం సులువు అవుతుంది. మనిషికి కావాల్సింది డబ్బు కాదు..ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం హరిచందనలో ఉంది. ఎంత డబ్బున్నా..ఐపీఎస్ సాధించాలన్న తన ఆశయంవైపు అడుగులు వేసింది. అనుకున్నది సాధించింది. Also Read: చదివింది సర్కారీ బడిలో…కొట్టింది ఐపీఎస్..ఇది దివ్య తన్వర్ సక్సెస్ స్టోరీ..!! #ias-harichandhana #ias-harichandhana-success-story #success-story #ias-hari-chandana-dasari #hari-chandana-dasari #ias-success-story #success-story-of-ias-hari-chandana-dasari #ias-hari-chandana-success-story మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి