Medaram : మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!!

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది .రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి 6వేలకు పైగా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఇక బస్సు ఛార్జీలు, మీ ప్రాంతం నుంచి మేడారం ఎంత దూరం లాంటి సమచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

Medaram : మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!!
New Update

Medaram Jatara 2024 : తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ఇవాళ్టి నుంచి మొదలుకానుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లుండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ అధికారులు ఛార్జీలు కూడా నిర్ణయించారు.

ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీ స్కీం(Mahalaxmi Scheme Free Bus) మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇక పురుషుల కోసం ఆర్టీసీ అధికారులు ఛార్జీలు విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన మేరకు బస్సులు నడిపే సెంటర్, కిలోమీటర్లు, పెద్దలు, చిన్నారులకు సంబంధించిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

Medaram Jatara 2024 Medaram Jatara Bus Fares

1.హనుమకొండ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు ఉండగా.. పెద్దలకు ఛార్జీ 250, చిన్నారులకు 140 గా బస్ ఛార్జీ నిర్ణయించారు

2. కాజీపేట నుంచి మేడారం జాతర(Medaram Jatara) 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

3. వరంగల్ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

4. జనగామ నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 370, చిన్నారుల ఛార్జీ: 210

5. హైదరాబాద్(Hyderabad) నుంచి మేడారం 259 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 550, చిన్నారుల ఛార్జీ: 310

6. హైదరాబాద్ పరిధిలోని మిగతా ప్రాంతాల నుంచి మేడారం 274 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 600, చిన్నారుల ఛార్జీ: 320

7. స్టేషన్ ఘన్ పూర్ నుంచి మేడారం జాతర 140 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 180

8. నర్సంపేట నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 150

9. కొత్తగూడ నుంచి మేడారం జాతర 137 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 170

10. పరకాల నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

11. చిట్యాల నుంచి మేడారం జాతర 115 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 140

12. మహబూబాబాద్ నుంచి మేడారం జాతర 155 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190

13. గూడూరు నుంచి మేడారం జాతర 125 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 280 , చిన్నారుల ఛార్జీ: 160

14. తొర్రూరు నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190

15. వర్ధన్నపేట నుంచి మేడారం జాతర 133 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 160

16. ఆత్మకూరు నుంచి మేడారం జాతర 90 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 210 , చిన్నారుల ఛార్జీ: 120

17. మల్లంపల్లి నుంచి మేడారం జాతర 75 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 180 , చిన్నారుల ఛార్జీ: 110

18. ములుగు నుంచి మేడారం జాతర 60 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150, చిన్నారుల ఛార్జీ: 90

19. భూపాలపల్లి నుంచి మేడారం జాతర 100 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 220, చిన్నారుల ఛార్జీ: 130

20. ములుగు(Mulugu) గణపురం నుంచి మేడారం జాతర 80 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 200 , చిన్నారుల ఛార్జీ: 110

21. జంగాలపల్లి నుంచి మేడారం జాతర 55 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150 , చిన్నారుల ఛార్జీ: 90

22. పస్రా నుంచి మేడారం జాతర 30 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 80 , చిన్నారుల ఛార్జీ: 50

23. గోవిందరావుపేట నుంచి మేడారం జాతర 35 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 100 , చిన్నారుల ఛార్జీ: 60

24. తాడ్వాయి నుంచి మేడారం జాతర 16 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 60 , చిన్నారుల ఛార్జీ: 40

ఇది కూడా చదవండి : రేపు వీరికి సెలవు…తెలంగాణ సర్కార్ ప్రకటన..పూర్తివివరాలివే..!!

#sammakka-saralamma-jatara #tsrtc-special-buses #medaram-jatara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe