Heavy Rains : ప్రకాశం బ్యారేజ్‌ విల విల.. 121 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి

121 ఏళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజీకి ఇదే అతిపెద్ద వరద అని ఆంధ్రప్రదేశ్‌ సీఎంవో ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్యధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా.. ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు పేర్కొంది.

New Update
Heavy Rains : ప్రకాశం బ్యారేజ్‌ విల విల.. 121 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఏపీలోని ప్రకాశం బ్యారేజీ ఉగ్రరూపం దాల్చింది. 121 ఏళ్ల చరిత్రలో ఈ బ్యారేజీకి ఇదే అతిపెద్ద వరద అని ఆంధ్రప్రదేశ్‌ సీఎంవో ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్యధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా.. ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు పేర్కొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమర్థవంతంగా నడిపిస్తున్నారని వెల్లడించింది.

Also Read: ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ

ఇదిలాఉండగా.. వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌పై ఇప్పటికే పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా 70 గేట్లు తెరిచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు కొన్ని పిల్లర్ల వద్ద గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 24.4 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది.

Also Read: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

Advertisment
తాజా కథనాలు