Cancer : పొగాకులో ఉండే ఈ సమ్మేళనం క్యాన్సర్‎తో పోరాడుతుంది: తాజా అధ్యయనం

ముల్లును ముల్లుతోనే తీయవచ్చు అనే సామెత మనకి పెద్దలు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే క్యాన్సర్ కు కారకం అయినటువంటి పొగాకు లోనే క్యాన్సర్ ను నిరోధించే మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు. పొగాకులో ఉండే డైమెథాక్సిక్వినాజోలిన్ అనే మూలకం క్యాన్సర్లు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని భారతీయ శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

New Update
Cancer : పొగాకులో ఉండే ఈ సమ్మేళనం క్యాన్సర్‎తో పోరాడుతుంది: తాజా అధ్యయనం

Cancer : పొగాకు క్యాన్సర్ కు కారణం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా స్టైల్, ఫ్యాషన్, రిలాక్సేషన్ , సరదా కోసం చాలా మంది స్మోకింగ్ చేస్తుంటారు. వాళ్లు తాగే సిగరెట్ బ్యాక్స్ పైన్నే ఉంటుంది...పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోరు. అయితే తాజాగా ఓ అధ్యయనంలో దీనికి భిన్నంగా తేలింది. పొగాకు ఆకుల(Tobacco Leaves)లో ఉత్పన్నమయ్యే సమ్మేళం అనేక రకాల క్యాన్సర్ లను ఎదుర్కొగల సామార్థ్యాన్ని కలిగి ఉంటుందని నిరూపితమైంది. అలహాబాద్ విశ్వవిద్యాలయం (Allahabad University) పూర్వవిద్యార్థులతో సహా పలు దేశాల శాస్త్రవేత్తలు బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది.

సరదాకు తాగే పొగాకుతో ఎంతో మంది బలి అవుతున్నారు. పొగాకు తాగడం ప్రమాదకరమని తెలిసినా..చాలా మంది ఆ అలవాటు నుంచి బయటపడలేకుపోతున్నారు. ఫలితంగా ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లోనే నిర్ణయించింది. డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాల్లో నాలుగింట ఒక వంతు పొగాకు వినియోగం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణం అవుతుందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‎లో బ్రేక్‎ఈవెన్ కొడతాం…ఐకియా దూకుడు..!!

అలహాబాద్ పూర్వ విద్యార్థి అమిత్ దూబే, భారత శాస్త్రవేత్త ఐషా తుఫైల్, మలేషియా పరిశోధకులు మియా రోని, ప్రొఫెసర్ ఏకెఎం మెయూనుల్ హుక్ లతో కలిసి జర్నల్ ఆఫ్ బయోమెలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ లో ప్రచురించారు. ఈ అధ్యయనం యొక్క పరిశోధనల ప్రకారం "4-<3-హైడ్రాక్సీయానిలినో>-6,7-డైమెథాక్సిక్వినాజోలిన్" అనే క్యాన్సర్ నిరోధక సమ్మేళనాన్ని పొగాకు ఆకుల నుండి సంగ్రహించవచ్చని, ఇవి క్యాన్సర్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటాయని పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని కూడా అమిత్ దుబే ప్రచురించారు. క్యాన్సర్ కణాలను నిరోధించే లక్షణం డైమెథాక్సిక్వినాజోలిన్ (Dimethoxyquinazoline) లో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై మరి శాస్త్రీయంగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని. ప్రస్తుతం దీనిపై కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి వెయ్యి మంది కమలదళం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు