PM Modi : పార్లమెంటు లో ఈరోజు నుంచీ పార్లమెంట్ బడ్జెట్(Parliament Budget) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో మొదలై... ఫిబ్రవరి 9న ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సెషన్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న అంటే రేపు మద్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సమాధానాలు ఈ పార్లమెంట్ సెషన్‌లో ఉండనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Also Read : Hyderabad:ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం
నారీశక్తికి ప్రతీక...
ఇక పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈసారి ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ ఒక దిశానిర్దేశం చేసేదిగా ఉంటుందని ప్రధాని అన్నారు. దేశం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని.. మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకం తనకు ఉందని మోడీ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో కూడా తాము గెలుస్తామని అప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం అంతా నారీశక్తి నడుస్తోందని అన్నారు. కొత్త పార్లమెంటు భవనం మొదటి సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినీయమ్ అని మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపాము. తర్వాత మొన్న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి(Nari Shakti) ని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు కూడా మొదట రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతున్నాయి. రేపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదంతా నారీ శక్తికి ప్రతీకే అని చెప్పారు మోడీ. దేశాన్ని ముందుకు నడిపించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
స్పీచ్ చివరిలో మోదీ 'రామ్ రామ్..' ఇలా ఎందుకున్నారంటే?
మీడియాతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ప్రధాని మోడీ చివరలో రామ్ రామ్ అంటూ ముగించారు. ప్రధాని మోడీ ఇలా అనడం ఇదే మొదటిసారి. ఎప్పుడూ లేనిది ప్రధాని ఇలా ఎందుకు అన్నారంటూ ఇప్పుడు మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది అయోధ్య రామమందిరం ప్రభావమా లేక బడ్జెట్‌లో రాముడికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి అని హింట్ ఇచ్చారా అని చర్చించుకుంటున్నారు. ఎన్నికల ముందు అయోధ్య రామమందిరం ప్రారంభించడంతో...యావత్ భారత ప్రజలు రామభక్తిలో మునిగిపోయారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఇది చివరి బడ్జెట్ కావడంతో మళ్ళీ రామభక్తిని అస్త్రంగా వాడుకుని ప్రజలను ఆకర్షించనున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పాక్ మాజీ ప్రధాని ఇమ్రన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష