/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Thieves-rampant-in-Narasapuram-in-West-Godavari-district-jpg.webp)
AP News: ఏపీలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒక ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చోట్ల చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. పేరుపాలెం బీచ్ సమీపంలో పాండురంగస్వామి ఆలయంలో హుండీని ధ్వంసం చేసి నగదు గుర్తుతెలియని దొంగలు అపహరించారు. వరుస దొంగతనాలతో జిల్లా వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
సీసీ కెమెరాలను పగలగొట్టి దోపిడీ
రెండు రోజుల క్రితమే పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్బీఐ బ్యాంక్‌లో అకౌంటెంట్‌ను కత్తితో బెదిరించి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే నరసాపురం నియోజకవర్గంలో మరో దొంగతనాలు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ యూనియన్ బ్యాంక్‌లో చోరీ చేయగా విఫలయత్నం చేశారు. బ్యాంక్ వెనుక వైపు గోడకు రంధ్రం చేసి బ్యాంకులోకి దుండగుడు ప్రవేశించాడు. బ్యాంక్ బయట ఉన్న సీసీ కెమెరాలను పగులగొట్టి దోపిడీకి యత్నించారు. సీసీ కెమెరాలో తేది సైతం సరిగా మార్చకవడంతో బ్యాంక్ అధికారులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీసీ కెమెరాలో 2004 సంవత్సరం చూపిస్తున్న డెటాపై పోలీసులు ఫైర్ అయ్యారు. వరుసగా జరిగిన మూడు ఘటనలు ఒక్కరే చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దొంగలను పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో..
ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో దొంగలు నిన్న రెచ్చిపోయిన విషయం తెలిసిందే. నిర్మాణాల కోసం సీడ్ యాక్సెస్ రోడ్డుపై భారీ ఇనుప పైపులను రాజధానిలో నిర్మించే రోడ్డు పక్కన వరద నీరు పోయేందుకు వేశారు. అధికారులు గత కొంతకాలంగా పట్టించుకోకపోవడంతో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి దొంగలు తీసుకెళ్తున్నారు. రాజధానిలో వరసగా చోరీలో జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: సబ్బును కేక్‌లా తిన్న చిన్నది..అసలు విషయం తెలిసి షాకైన జనం