Thieves Attacked On Bus : మహారాష్ట్ర(Maharashtra) కు చెందిన ఓ మినీ బస్సు దోపిడీ దొంగలు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అమరావతి(Amaravati) నుంచి నాగ్‌పూర్(Nagapur) వెళుతుండగా హైవే మీద ఈ ఘటన జరిగింది. ఇదొక చిన్న మినీ బస్సు(Mini Bus). ఇందులో దాదాపు ౩౦ మంది యాత్రికులు ఉన్నారు. అర్ధరాత్రి సడెన్‌గా హైవే మీద ఎవరూ లేని చోట దొంగలు అటాక్ చేశారు. కాల్పులు జరిపితే బస్సు ఆగుతుంది అనుకున్నారు. కానీ బస్సు డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే పాహసం వలన యాత్రికులు అందరూ సురక్షితంగా తప్పించుకోగలిగారు.
దొంగలు జరిపిన కాల్పుల్లో ఖోమ్‌దేవ్ చేతికి బుల్లెట్ తగిలింది. తీవ్రగాయమై... రక్తం కారింది కానీ ఆయన దానికి భయపడలేదు. యాత్రికుల(Passengers) క్షేమమే ముఖ్యం అనుకున్నారు. అలానే చేతికి అయిన గాయంతోనే బస్సును ఆపకుండా నడిపించారు. దొంగలకు దొరకకుండా ౩౦ కి.మీ నడిపారు. ఆ తరువాత అక్కడ ఉన్ పోలీస్ స్టేషన్‌లో బస్సును ఆపి జరిగినదంతా పోలీసులకు వివరించారు.
ఖోమ్‌దేవ్ చెప్పిన ప్రకారం బస్సు హైవే మీద వెళుతుండగా.. బొలేరోలో దొంగలు వెంబడించారు(Thieves Attacked). ముందు వెళతారేమో అని రెండుసార్లు దారి ఇచ్చినా వెళ్ళలేదు. వెనుకనే వెంబడిస్తూ ఉన్నారు. కొంతసేపటికి దొంగలు ముందుకు వచ్చి తన మీద కాల్పులు జరిపారని చెప్పారు డ్రైవర్ ఖోమ్‌దేవ్. మొదటిసారి తప్పించుకోగలిగినా...రెండోసారి మాత్రం చేతికి గాయమైంది తెలిపారు. కానీ యాత్రికులను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుని...నొప్పిని భరిస్తూనే బస్సును నడిపానని వివరించారు. డ్రైవర్ ధైర్యం, చొరవ వల్లనే తాము సురక్షితంగా ఉన్నామి అంటున్నారు యాత్రికులు.
Also Read : ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!