Hundi: గుడి హుండీలో దొంగతనానికి యత్నం.. ఇరుక్కుపోయిన చెయ్యి

కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో పోచమ్మ ఆలయంలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి.. మంగళవారం రాత్రి హుండీలో డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. కానీ అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయి బయటికి రాలేదు. ఉదయం అతడిని చూసిన స్థానికులు కట్టర్ సాయంతో చేయి బయటికి తీశారు.

New Update
Hundi: గుడి హుండీలో దొంగతనానికి యత్నం.. ఇరుక్కుపోయిన చెయ్యి

కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గుడిలో పనిచేస్తున్న వ్యక్తి.. ఆ గుడిలో హుండీలో డబ్బులు దొంగతనం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆ హుండీలోని అతడి చేయి ఇరుక్కుపోయింది. చివరికి ఉదయం గుడికి వచ్చిన స్థానికులు అతడి చేయిని బయటికి తీశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో సురేశ్‌ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. హుండీలో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లాని అనుకున్నాడు.

Also Read: అభిలాష్ మృతిపై వీడని మిస్టరీ

ఇందుకోసం మంగళవారం రాత్రి ఆలయంలోకి వచ్చాడు. హుండీ పైభాగాన్ని ధ్వంసం చేసి.. అందులో చేయి పెట్టి డబ్బులు తీయాలని చూశాడు. కానీ చేయి అందులోనే ఇరుక్కుపోయింది. బయటికి తీయడానికి ఎంత ప్రయత్నించిన రాలేదు. దీంతో అలాగే ఉండిపోయాడు. అతడికి అతడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చివరకి కట్టర్‌ సహాయంతో హుండీని కత్తిరించి.. సురేష్ చెయ్యిని బయటికి తీశారు. ఆ ఆ తర్వాత పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.


Also Read: ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్‌

Advertisment
తాజా కథనాలు