Roshan Kanakala: నన్ను కర్రోడా అంటూ ఎగతాళి చేశారు.. గుక్క పెట్టి ఏడ్చిన సుమ కొడుకు

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో తనను దారుణంగా ట్రోల్ చేశారని రోషన్‌ కనకాల తెలిపాడు. వీడు నల్లగా ఉన్నాడు. హీరో మెటీరియల్‌ కాదంటూ ఎగతాళి చేశారు. కానీ నేను బాధపడలేదు. ఎందుకంటే ఒక మనిషి అందం రంగులో ఉండదు. క్రమశిక్షణ, కమిట్ మెంట్ సక్సెస్‌ను అందిస్తుందన్నాడు.

New Update
Roshan Kanakala: నన్ను కర్రోడా అంటూ ఎగతాళి చేశారు.. గుక్క పెట్టి ఏడ్చిన సుమ కొడుకు

టాలీవుడ్ స్టార్ కిడ్, రాజీవ్‌ కనకాల- సుమల కొడుకు రోషన్‌ (Roshan Kanakala) ‘బబుల్‌గమ్‌’ (Bubblegum) సినిమాతో హీరోగా పరిచమైన విషయం తెలిసిందే. కాగా రవికాంత్‌ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ డిసెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్న రోషన్.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. తన లైఫ్ స్టైల్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలతోపాటు తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. తన స్కిన్ కలర్, గ్లామర్ గురించి చాలా నెగెటీవ్ కామెంట్స్ చేశారని, నల్లగా ఉన్నానంటూ దారుణంగా ఎగతాళి చేసినట్లు తెలిపాడు.

ఈ సినిమాకంటే ముందు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొత్తలో దారుణంగా ట్రోలింగ్ చేశారు. వీడు నల్లగా ఉన్నాడు. హీరో మొహమే లేదు. హీరో మెటీరియల్‌ కాదంటూ కామెంట్స్ చేయడం నేను స్వయంగా విన్నాను. నిజంగా నా వెనుక ఇలాంటివి మాట్లాడుతూ ట్రోల్‌ చేయడం ఒక దశలో బాధనిపించింది. అయినా నేను ఇలాగే పుట్టాను. ఇలాగే ఉంటాను. ఒక మనిషి అందం రంగులో ఉండదు. అతడి సక్సెస్‌ను నలుపు, తెలుపు నిర్ణయించవు. అతడి ప్రతిభ, క్రమశిక్షణ, సినిమా కోసం అతడు పడిన కష్టం మాత్రమే విజయాన్ని అందిస్తాయి. మన అందరి తలరాతల్లో ఏం రాసుందో ఎవరికీ తెలియదు. మనకు నచ్చినట్లు దాన్ని మార్చుకోవాలని నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ముదుకెళ్తున్నానని చెప్పాడు.

publive-image

అలాగే స్టేజ్‌పై ‘బబుల్‌గమ్‌’లోని డైలాగులు ప్రేక్షకులను అలరిస్తున్నందుకు హ్యాపీగా ఉందని, సినిమాతో పరిచయమైన మానస చౌదరిని మంచి నటిగా పేర్కొంటూ ప్రశంసించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు