Kids Fitness:పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి

పిల్లలు బాగా పెరగాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా ఏకాగ్రత ముఖ్యం. ఇప్పుడు పిల్లల్లో ఫోకస్ చాలా తక్కువ ఉంటోంది. మొబైల్స్, ఆటల్లో ఉండే ఇంట్రస్ట్ చదువుల్లో ఉండటం లేదు. ఇలా ఏకాగ్రత తగ్గకుండా ఉండాలి అంటే పిల్లల చేత కొన్ని రోజూ కొన్ని ఆసనాలు వేయించాలి.

New Update
Kids Fitness:పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి

నేటికాలంలో పిల్లలు ఎక్కువగా బయటకు వెళ్ళి ఆడుకోవడం లేదు. రోజంతా మొబైల్స్, ట్యాబ్లెట్స్‌తో టైమ్‌ పాస్ చేస్తున్నారు. యూట్యూబ్, గేమ్స్‌ల్లోనే మునిగిపోతారు. ఇది వారి చదువుల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. దీని కారణంగా ఏకాగ్రత తగ్గడం, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే కొన్ని యోగాసనాలు హెల్ప్ చేస్తాయి. వీటిని రోజూ పిల్లల చేత చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

యోగా చేయడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. పిల్లల మనసు, కండరాల బలంగా కూడా పెరుగుతుంది. యోగా చేయడం వల్ల మానసిక, శారీరక బ్యాలెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను పంచి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తుంది.

Also read:కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ షర్మిల?

అధోముఖశ్వనాసనం...
ఈ పోశ్చర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది శరీరాన్ని బలంగా చేస్తుంది. దీనికి ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్సింగ్ అవసరం. ఈ ఆసనం చేతుల బలాన్ని పెంచడంలో సాయపడతుంది. వీటితో పాటు కాలు, చేతులు, భుజాల కండరాలని బలంగా చేసి నడుము నొప్పిని తగ్గిస్తుంది. మొదట బోర్లా పడుకుని తర్వాత చేతుల సాయంతో శరీరాన్ని పైకి లేపాలి. తర్వాత పాదం మీద బరువు పెట్టాలి. ఇప్పుడు ఈ పోజిషన్ లో కొంత సేపు పాటూ ఉండాలి.

తాడాసన...
ఈ ఆసనం కూడా ఫ్లెక్సిబిలిటీని పెంచి గట్ హెల్త్‌ని మెరుగ్గా చేస్తుంది. ఈ పోశ్చర్ కాలి కండరాల శరీర భాగాల బలాన్ని పెంచుతుంది. ఈ ఆసనం పిల్లల కండరాలిని పెంచి ఎత్తు పెరిగేలా చేస్తుంది. చేతులని పైకెత్తి నమస్కారం పొజిషన్‌లో ఉంచాలి. నెమ్మదిగా పాదాలను పైకెత్తాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉండగలిగినంత సేపు ఆ పొజిషన్ లో ఉండాలి.

భస్త్రికా ప్రాణాయామం

ఇది మెదడుకి ఆక్సిజన్‌ని పెంచుతుంది. చేతి, కంటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసి కాళ్ళు, వీపుకు మంచి వర్కౌట్‌‌లా ఉపయోగపడుతుంది. భుజాలను రిలాక్స్ చేస్తుంది. మానసిక, శారీకంగా బలంగా చేస్తుంది. ఇది చేయడానికి ముందు కింద మఠం వేసుకుని కూర్చోవాలి. ముక్కు ద్వారా గాలిని పీల్చుతూ.. రెండు చేతులని పైకి లేపాలి. తరువాత చేతులని కిందకి దించుతూ నోటి ద్వారా గాలి పీల్చాలి.

భ్రమరి ప్రాణాయామం..
ఈ ప్రాణాయామం చేస్తే మనసు ప్రశాంతంగా మారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగ్గా ఉంటుంది. దీంతో ఒత్తిడి ఆందోళన కూడా తగ్గుతుంది. ఇది లాలాజలాన్ని ఉత్పత్తి చేసి జీర్ణక్రియని మెరుగ్గా చేసి ఊపిరితిత్తుల బలాన్ని పెంచుతుంది. కింద మఠం వేసుకుని కూర్చుని రెండు చెవులని బొటనవేళ్ళతో, చూపుడు వేళ్ళతో కళ్ళని కవర్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా మ్మ్ అంటూ హమ్మింగ్ చేస్తూ ఊపిరి పీల్చుకోండి. ఇలా అవసరమైనన్నీ సార్లు రిపీట్ చేయండి.

ఈ ఆసనాలు కేవలం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఇవి చేసే ముందు యోగా ట్రైనర్ ను ఒకసారి సంప్రదించడమో లేదా వీటికి సంబంధించిన వీడియోలు చూడడమో చేయాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు