Uric Acid Problems Gone : యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థపదార్థం. ఇది ఎక్కువ కావడం.. శరీరంలో పేరుకుపోవడం రెండూ ఒక పెద్ద సమస్య. మీ శరీరం ఆహారం, పానీయాలలో ప్యూరిన్స్ అనే రసాయనాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. రెడ్ మీట్, మిన్‌స్డ్ మీట్, ఆర్గాన్ మీట్, సీ ఫుడ్స్(Sea Foods) తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే కీళ్ల సమస్యలు, కిడ్నీ జబ్బులు, గుండెపోటు తదితర ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక పరిమాణంలో ఉత్పత్తి అయితే, లివర్ దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది. దీని వలన రక్తంలో యూరిక్ యాసిడ్(Uric Acid) స్థాయి గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మనకు హైపర్యూరిసెమియా సమస్య వచ్చే అవకాశం ఉంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కిడ్నీలు కూడా ప్రభావితమవుతాయి. పెరిగిన యూరిక్ యాసిడ్ లక్షణాలు(Uric Acid Symptoms) వికారం, మూత్రం రంగులో మార్పు, మూత్రవిసర్జన సమయంలో మండుతున్న అనుభూతి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల, చేతులు, కాలి వేళ్లలో నొప్పి మొదలవుతుంది. ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోండి.
మీరు యూరిక్ యాసిడ్(Uric Acid) తగ్గించుకోవాలంటే, మీరు నీటిని మరిగించి తాగాలి. కొన్ని కూరగాయల వినియోగం ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని సులభంగా నియంత్రించవచ్చు. యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఏ కూరగాయలు తినాలో తెలుసుకుందాం.
పుట్టగొడుగులు..
యూరిక్ యాసిడ్(Uric Acid) ఎక్కువగా ఉన్నట్లయితే మీరు పుట్టగొడుగులను తీసుకోవాలి. మష్రూమ్స్ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శాఖాహారులు మటన్ లాగా తినే కూరగాయ. పొటాషియం పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి అదుపులో ఉంటుంది. అధిక పొటాషియం సమృద్ధిగా ఉండే ఈ కూరగాయల యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రిస్తుంది. మీరు యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంతరించుకోవడం కోసం పుట్టగొడుగులను తినడం మంచిది.
Also Read : షాకింగ్.. కోవిడ్ దెబ్బకు.. అందరి ఆయుష్షూ తగ్గిపోయిందిగా..
క్యాబేజీ..
యూరిక్ యాసిడ్(Uric Acid) స్థాయిని నియంత్రించాలనుకుంటే క్యాబేజీ కూడా మంచి ఫుడ్. ఇతర కూరగాయల కంటే ముద్ద క్యాబేజీని తీసుకోవడం ఆరోగ్యకరమైనది. ఈ క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ప్యూరిన్ జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేస్తాయి. వాటిని మూత్రం ద్వారా శరీరం నుండి తొలగిస్తాయి.
టమోటా..
యూరిక్ యాసిడ్(Uric Acid) ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ టమోటాలు విత్తనాలను తీసివేసిన తర్వాత తినాలి. టొమాటోల్లో ఉండే పొటాషియం యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే టొమాటోలు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడతాయి.
గమనిక: ఈ ఆర్టికల్ లో ఇచ్చిన అంశాలు వివిధ సందర్భాల్లో నిపుణులు చెప్పిన విషయాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పాఠకుల ప్రాధమిక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య ఇబ్బంది ఉన్నపుడు.. ఆహారంలో మార్పులు చేర్పులు చేసే ముందు మీ వైద్యుల సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నాం.