Health Tips: మీ శరీరంలో ఈ లోపాలు కనిపిస్తున్నాయా? ..అయితే విటమిన్‌ డి లోపం ఉన్నట్లే!

విటమిన్ డి లోపం కారణంగా, ఎముకలు బలహీనపడతాయి. దీంతో ఎముక సంబంధిత సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల శరీరం లోని రోగనిరోధక శక్తి ప్రభావితమవుతుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి.

New Update
Health Tips: మీ శరీరంలో ఈ లోపాలు కనిపిస్తున్నాయా? ..అయితే విటమిన్‌ డి లోపం ఉన్నట్లే!

విటమిన్ డి (Vitamin D)మన శరీరానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి శరీరానికి కాల్షియం(Calcium)ను పెంచడంలో సహాయపడుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం కారణంగా, ఎముకలు బలహీనపడతాయి. దీంతో ఎముక సంబంధిత సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల శరీరం లోని రోగనిరోధక శక్తి ప్రభావితమవుతుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి.

విటమిన్ డి లోపం లక్షణాలు
కండరాల అలసట భావన, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, తరచుగా అనారోగ్యం, అలసినట్లు అనిపించడం, వెన్నునొప్పి మొదలైనవి విటమిన్‌ డి లోపం వల్ల వచ్చే సమస్యలు.

విటమిన్ డి లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి:

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ:

విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ శరీరంలో విటమిన్‌ డి లోపం ఉంటే, శరీరం వైరస్‌తో పోరాడదు. దీంతో ప్రజలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు.

బలహీనత, అలసట:

విటమిన్ డి లోపం వల్ల చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరం బలహీనంగా తయారవుతుంది

ఒత్తిడి కూడా కారణం:

డిప్రెషన్ కూడా విటమిన్ డి లోపానికి ప్రధాన సంకేతం. స్థిరమైన బలహీనత, అలసట మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. దీంతో డిప్రెషన్ వ్యక్తులను సులభంగా చుట్టుముడుతుంది.

అధిక జుట్టు రాలడం:

మనలో చాలా మందికి తెలియదు, కానీ విటమిన్ డి లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. దాని లోపం కారణంగా, జుట్టు రాలడం చాలా తీవ్రంగా మారుతుంది.

మొటిమలు, దద్దుర్లు:

చర్మంపై మొటిమల సమస్య కొనసాగితే, మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నట్లే. అలాంటి వారికి ఈ చర్మ సమస్యల వల్ల అకాల వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది.

ఈ వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు

సూర్యరశ్మి తీసుకోని వ్యక్తులు విటమిన్ డి లోపానికి ఎక్కువగా గురవుతారు. లేకపోతే పాల అంటే అలెర్జీ ఉన్నవారిలో విటమిన్ డి లోపం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా వృద్దులు, నల్లటి చర్మం ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారిలో కూడా విటమిన్‌ డి లోపం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి.

Also read: ఈ వ్యాధులు మీపై దాడి చేయకముందే రోజుకో ఉసిరికాయను నమిలేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు