/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/these-symptoms-appear-in-the-body-it-is-like-having-lumps-in-the-stomach-jpg.webp)
Health Tips: ప్రతీ ఒక్కరు శరీరంపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో చిన్నా పెద్ద అనే సంబంధం లేకుండా అనేక వ్యాధులు వస్తున్నాయి . కొందరికి జాన్యూపరమైన వ్యాధులు వస్తే.. మరికొందరిలో ఆహారాపు అలవాట్లు, పని ఒత్తిడి కారణం వస్తున్నాయి. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే సరైనా ఆహారం తీసుకోవాలని నిపుణులు చెతున్నారు. అయితే.. కొంతమంది ప్రేగులలో లేదా మరెక్కడైనా గడ్డలను పెద్దగా పట్టించుకోరు. కానీ దీనిని సకాలంలో చికిత్స చేయకపోతే.. ఇది తీవ్రమైన వ్యాధి రూపంలో ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గడ్డులు ఎందుకు వస్తాయి.. అవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు. మన శరీరం మీద గడ్డులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వీటికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంపై గడ్డలు వస్తే ఏం చేయాలి:
- మన శరీరంలో పేగు చాలా ముఖ్యమైన భాగం. దాని సహాయంతో.. పోషకాలు శరీరంలో జీర్ణమవుతాయి. అందువల్ల పేగు ఆరోగ్యం చాలా ముఖ్యం. అందులో చిన్నపాటి అవాంతరాలు వచ్చినా శరీరం మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది.
- పేగులో గడ్డలు ఉంటే స్వీట్లు తినాలనిపిస్తుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరగడం వలన తీపి ఆహారం కోసం కోరిక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- ప్రేగు సంబంధిత రుగ్మతల కారణంగా మానసిక స్థితి మొత్తం చెడిపోతుంది. దీని వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మూడ్ కూడా ఆఫ్ కావచ్చు.
- ప్రేగులలో ఆటంకాలు మొదలైతే.. కడుపు శుభ్రంగా ఉండదు, మలబద్ధకం వంటి సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించి, సరైన చికిత్సను సకాలంలో తీసుకోవాలి. లేకపోతే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
- కడుపు చుట్టూ వాపు, ఏదైనా సమస్య ఉంటే.. అప్పుడు ప్రేగులో గడ్డ ఉందని అర్థం చేసుకోవాలి. ప్రేగులలో వాపు ప్రేగులలో ఒక ముద్దను సూచిస్తుంది.
ప్రేగు సంబంధిత సమస్యల విషయంలో.. మలవిసర్జనలో రక్తం, గాయం కూడా ఏర్పడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచితే ఈ రోగాలు తప్పవు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.