Healthy kidney: మూత్రపిండాల ఆరోగ్యానికి ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే

మనం తినే ఆహారం, తాగే పానీయాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. పానీయాలను, ఆహారాలను ఫిల్టర్ చేసి వ్యర్థాలను వడకట్టేవి కిడ్నీలు. కిడ్నీల ఆరోగ్యం కోసం చిలగడదుంపలు, చేపలు, దోసకాయలు, విటమిన్-సి, క్రాన్ బెర్రీస్ తినాలి.

New Update
Healthy kidney: మూత్రపిండాల ఆరోగ్యానికి ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే

ఈ మధ్యకాలంలో కిడ్నీ సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలను కూడా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. మనలో ఉండే కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. కిడ్నీలు రక్తం నుంచి వ్యర్థాలు, టాక్సిన్‌లను ఫిల్టర్ చేసి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. కావునా.. కిడ్నీలు ఆరోగ్యం ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలను చూద్దాం.
ఈ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలి:
చిలగడదుంపలు: చిలగడదుంపలలో పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు మూత్రపిండాలపై దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. CKD లేదా డయాలసిస్‌లో చేయించుకుంటున్నవారు డాక్టర్ల సూచనలు తీసుకుని తింటే మంచిది.
దోసకాయలు: దోసకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. దోసకాయలు మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా చూస్తుంది. రోజూ దోసకాయలు తింటే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
చేపలు: చేపలను తింటే మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి. చేపలల్లో ఒమేగా -3 కొవ్వులు అధికంగా ఉంది. దీనిని తినటం వల్ల అధిక రక్తపోటు తగ్గి మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్-సి: నిమ్మ, నారింజ పండ్లల్లో ఎక్కువగా తినటం వలన మూత్రపిండాల్లోని వ్యర్థాలను బయటికి పోతాయి. ఈ పండ్లలో ఉండే అధిక స్థాయిలో సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అంతేకాదు మూత్రంలో తక్కువ ఆమ్లాన్ని అడ్డుకుని మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నీరు: మూత్రపిండాలను శుభ్రపరిచి, వ్యర్ధాలను బయటకు పంపటంలో నీరు ముఖ్యమైనది. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీటిని తీసుకుంటే మంచిది. దీని వల్ల హైడ్రేటెడ్‌గా ఉంచి శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటికి పంపి.. సహజంగా మూత్రపిండాలను క్లీన్ చేస్తుంది.
క్రాన్ బెర్రీస్: ఈ పండ్లు జ్యూస్ రూపంలో తాగితే కిడ్నీలకు మంచిది. క్రాన్‌బెర్రీస్‌ జ్యూస్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రావు. మూత్రాశయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండ్లు చాలా మంచిగా పనిచేస్తోంది.
ముదురు ఆకుకూరలు: బచ్చలికూర, కాలే వంటి ముదురు ఆకుకూరలు చాలా రకాల విటమిన్లు, ఫైబర్స్, పొటాషియం, ఖనిజాలంటాయి. ఈ ఆకుకూరల్లో అనేక యాంటీఆక్సిడెంట్లు వంటి రక్షిత సమ్మేళనాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: పవర్ లూం క్లస్టర్ మంజూరు కావాలంటే నన్ను గెలిపించడి: రాణి రుద్రమరెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు