Brain stroke: ప్రస్తుత కాలంలో డబ్బు మీద పిచ్చితో మెదడుకు రెస్ట్ ఇవ్వడం లేదు. మన శరీరంలో గుండె తర్వాత ముఖ్యమైనది మెదడు. ఎప్పుడూ మెదడు యాక్టీవ్‌గా షార్ప్‌గా పని చేస్తేనే ఏ పనినైనా మనం చేయగలం. అయితే.. మెదడులోని ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగటం అంతరాయం వస్తే ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ కి అందాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందక ఆ కణాలు చనిపోతాయి. దీని వలన శరీరంలో ఇతర భాగాలు సరిగా పని చేయవు.. అలా మెదడుకు రెస్ట్ లేకుంటే స్ట్రోక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎక్కువగా ఒత్తిడి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ మీ పనులను ముందుగానే చేసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకవోచ్చు. ఎక్కువ ఒత్తిడి ఉంటే బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు వంటి సమస్యలు వస్తాయి.. అందుకే ఎక్కువ టెన్షన్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు వైద్యులు.
- ముందే తీనుకునే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మంచి ఆహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం తీసుకునే ఆహారంలోనే అంతా ఉంటుంది కాబట్టి అన్నీ సమపాళ్లల్లో ఉండేలా ఆహారం తీసుకోవాలి. అలాగే బ్రెయిన్‌ని యాక్టీవ్‌గా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
- ఇప్పటి కాలంలో చాలామంది పోషకల ఆహారం లోపంతో బాధపడుతున్నారు. ఆహారంతో పాటు మంచి నిద్ర ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి రోజూ వారికి సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్ర లేకపోతే గుండె జబ్బులు, అధిక బరువు, మధుమేహంతో పాటు మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది.
- ఈ మధ్య కాలంలో యువత ధూమ, మద్య పానంతో ఎక్కువ బానిస అవుతున్నారు. రెండూ ఆలవాట్లు ఉంటే బ్రెయిన్‌పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇవి బ్రెయిన్ స్ట్రోక్‌కు అధిక కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. కొవ్వు కలిగిన పదార్థాలను తీసుకుంటే గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- స్ట్రోక్ ఎటువంటి హెచ్చరిక లక్షణాలు లేకుండా కనిపిస్తుంది. అయితే ఏదైనా మాట్లాడేటప్పుడు, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, ముఖం, చేయి, కాలులోని కొన్ని భాగాలలో తిమ్మిరి, విజన్ సమస్యలు, మైకము, వాంతులు వంటివి బ్రెయిన్ స్ట్రోక్ ప్రధాన లక్షణాలని పరిశోధన ఆధారంగా చెబుతున్నారు.
నోట్: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా పబ్లిష్ చేశాం. ఎక్కువ సమస్యలు ఉంటే సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.
ఇది కూడా చదవండి: ఇలా మీ నుదుటిన బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటారు