Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్ ఫీల్డ్ బండి మీద కూర్చుంటే రాజసం ఉట్టిపడినట్లేనని యూత్ అంటుంది. యూత్ ఆలోచనలకు తగ్గట్లుగానే ఆ కంపెనీ కొత్త ఫీచర్లతో కొత్త బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తాజాగా మరో సరికొత్త బైక్ మార్కెట్లోకి లాంచ్చ చేసింది. ఆ బండే రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 (Royal Enfield Shotgun 650). ఈ కొత్త 650సీసీ మోటార్‌సైకిల్ ధర రూ. 3.59 లక్షల నుంచి రూ. 3.73 లక్షల వరకు ఉంది. ధర పరంగా, ఇది ఇంటర్‌సెప్టర్ 650 (రూ. 3.03-3.31 లక్షలు) సూపర్ మెటోర్ 650 (రూ. 3.64- 3.94 లక్షలు) మధ్య ఉంటుంది.
షాట్‌గన్ 650 రంగులు, ధర:
1. షీట్ మెటల్ గ్రే- రూ 3.59 లక్షలు
2. డ్రిల్ గ్రీన్- రూ 3.70 లక్షలు
3. ప్లాస్మా బ్లూ- రూ 3.70 లక్షలు
4. స్టాన్సిల్ వైట్- రూ 3.73 లక్షలు
ఇవి ఎక్స్ షోరూం ధరలు
ఈ బైక్ ఇతర బైకుల కంటే చాలా భిన్నం:
ఈ మోటార్ సైకిల్ ఎక్కువగా సూపర్ మోటోర్ ఫ్లాట్ ఫాంపై ఆధారపడి ఉన్నా...కస్టమ్ డిజైన్ తో వస్తుంది. ఇప్పటివరకు ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ ప్రీమియం ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగి ఉంది. ఫేమస్ కాన్సప్ట్ మోడల్ ఎస్ జి 650 ఆధారంగా డిజైన్ చేశారు. సూపర్ మెటోర్ 650 డిజైన్ (Super Meteor 650 design)చేసిన అదే స్టీల్ ట్యూబ్యులర్ స్పైన్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు..కొత్త షాట్‌గన్ 650 కూడా అదే 648cc, ఈక్వల్ ట్విన్, 4-స్ట్రోక్, SOHC, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 7250rpm వద్ద 46.4bhp, 5,650rpm వద్ద 52.3Nm ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది 22kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.
సూపర్ మెటోర్ 650తో పోలిస్తే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 వీల్‌బేస్ 35 మిమీ తక్కువగా ఉంటుంది. ఇది 1465mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 140mm. ఈ బైక్ 2170 mm పొడవు, 820 mm వెడల్పు,1105 mm ఎత్తుంది. సీటు ఎత్తు 55 మిమీ పెరిగి 795 మిమీ వరకు ఉంది. మోటార్‌సైకిల్ బరువు 240 కిలోలు, ఇది సూపర్ మెటోర్ 650 కంటే కేవలం 1 కిలో తక్కువ.
ఇది 13.8-లీటర్ సామర్థ్యం గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇది సూపర్ మెటోర్ 650 కంటే దాదాపు 2-లీటర్లు తక్కువ. ఇది షోవా-సోర్స్డ్ బిగ్ పిస్టన్ USD ఫ్రంట్ ఫోర్క్‌తో 120 మిమీ ప్రయాణాన్ని కలిగి ఉంది. వెనుక భాగంలో, 90 మిమీ ట్రావెల్‌తో కూడిన ట్విన్-షాక్ అబ్జార్బర్ ఉంది. ఈ బాబర్-శైలి బైక్‌లో 18-అంగుళాల ముందు 17-అంగుళాల వెనుక చక్రం ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వరుసగా 100/90, 150/70 సెక్షన్ టైర్లు ఉన్నాయి.
బ్రేకింగ్ కోసం, మోటార్‌సైకిల్‌కు డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫ్రంట్ 320mm డిస్క్, బ్యాక్ 300mm డిస్క్ అందించింది. మోటారుసైకిల్ సింగిల్-సీట్ లేఅవుట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, వినియోగదారులు ట్విన్-సీట్ మోడల్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.