Google Search: ఈ ఏడాది గూగుల్ లో తెగ వెతికేసిన పదాలు ఏంటో తెలుసా!

ఈ ఏడాది ఎక్కువగా వెతికిన పదాల గురించి గూగుల్ ఓ నివేదిక ప్రకటించింది. అందులో ఎక్కువ మంది చంద్రయాన్‌ 3 గురించి సెర్చ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఒడిశా రైలు ప్రమాదం, కర్ణాటక రాజీకీయాల గురించే ఎక్కువ మంది శోధన చేసినట్లు గూగుల్‌ తెలిపింది.

Google: గూగుల్ లో కొత్త ఫీచర్‌ వచ్చేస్తుంది..ఇక వారందరికీ...!
New Update

మరో 14 రోజుల్లో 2023 ఏడాది (Year End)  ముగుస్తుంది. కొత్త సంవత్సరం (New Year)  గురించి ఎన్నో కలలు కంటూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు మనందరం సిద్దంగా ఉన్నాం. డిసెంబర్‌ నెల 1 వ తారీఖు నుంచే ఈ ఏడాది జరిగిన అన్ని విషయాల గురించి రివిజన్‌ చేస్తుంటాం. ఈ క్రమంలోనే గూగుల్‌ సెర్చింగ్‌ ల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం.

గూగుల్ అంటే చాలా మంది అనేక పదాలను సెర్చ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో గూగుల్‌ ఎక్కువమంది సెర్చ్‌ చేసిన పదాలు కొన్నిటిని గురించి గూగుల్‌ వివరించింది. ఈ ఏడాది ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది ఏదైనా ఉంది అంటే అది చంద్రయాన్‌ 3 అనే చెప్పుకోవచ్చు.చంద్రుని మీద చంద్రయాన్‌ 3 విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా చంద్రుని పై అడుగు పెట్టి రికార్డులు సృష్టించింది.

అలా గూగుల్‌ లో ఎక్కువ మంది వెతికిన పదాల్లో చంద్రయాన్‌ 3 ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇక తరువాత వెతికిన పదం ఏంటంటే.. కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన విషయం అని చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వేడి పుట్టించాయి. ఇక ఆ తరువాత ఇజ్రాయెల్ హమాస్‌ యుద్దానికి సంబంధించిన విషయం.

ఆ తరువాత ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఒడిశా బాలసోర్‌ రైలు ప్రమాదం గురించి గూగుల్‌ లో ఎక్కువ మంది వెతికినట్లుగా సమాచారం. ఆ తరువాత ఇజ్రాయెల్ హమాస్‌ యుద్దం గురించి గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు గూగుల్ తెలిపింది. ఆ తరువాత బడ్జెట్‌ 2023 గురించి చాలా మంది సెర్చ్‌ చేసినట్లు గూగుల్‌ ప్రకటించింది.

ఇక ఆ తరువాత మణిపూర్‌ హింస గురించి, యూసీసీ అంటే ఏమిటి,ఛాట్‌ జీపీటీ అంటే ఏమిటి, హమాస్‌ అంటే ఏమిటీ, ఆ తరువాత ఎంతో మంది ఆసక్తికరంగా వెతికిన అంశం కొత్త పార్లమెంట్ల్‌ లో కొలువైన సెంగోల్ గురించి ఎక్కువమంది వెదికినట్లు సమాచారం. ఆ తరువాత టర్కీ భూకంపం, అతిక్‌ అహ్మద్‌, మాథ్యూ పెర్రీ, ఇన్‌ స్టా గ్రామ్‌ థ్రెడ్‌ అంటే ఏమిటి అనే పదాలను గూగుల్‌ లో ఎక్కువగా వెతికినట్లు గూగుల్‌ నివేదికలు వెల్లడించాయి.

Also read: నా 21 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలా ఎప్పుడూ అనుకోలేదు : ప్రభాస్‌!

#google-account #year-end-review-2023 #searching
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe