Health Tips: ఉదయాన్నే తులసి నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు ఇవే తులసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతీ రోజూ ఉదయాన్నే తులసిని నీళ్లల్లో వేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. తులసిలో ఉండే కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియకు మెరుగుపరిచి గ్యాస్, ఉబ్బరం సమస్య ఉంటే తగ్గిస్తుంది. By Vijaya Nimma 02 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tulsi Water Benefits: తులసి మొక్కకు అధ్యాత్మికంగా ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అలాంటి తులసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే.. దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే.. ప్రతీ రోజూ ఉదయాన్నే ఈ తులసిని నీళ్లల్లో వేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: బార్లీ గింజలు చేసే మేలు తెలిస్తే షాక్ అవుతారు..! తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కణాలను దెబ్బతినకుండా సహాయపడుతుంది. ఈ తులసికి ఇమ్యునోమోడ్యులేటరీ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెచుతుంది. తులసి నీటిని ప్రతీరోజూ తాగితే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయి.. అంటు వ్యాధుల నుంచి కాపాడుతోంది. తులసిలో ఉండే కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియకు మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. గ్యాస్, ఉబ్బరం సమస్య ఉంటే తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలకు చికిత్స.. రోజూ మనం తాగే నీటిలో మూడు ఆకులను వేసి కొద్ది కొద్దిగా తాగితే క్రీముల బారిన పడకుండా ఉంటారు. తులసిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్లతో పోరాడి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు తులసి నీటితో పుక్కిలించడం వలన చిగుళ్లు ఆరోగ్యంగా ఉండి.. నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాదు మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. ఈ తులసిని దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల చికిత్సకు వాడుతారు. రోజూ తులసి నీటిని తాగితే..శ్వాసకోశ వ్యవస్థపై, ఒత్తిడి, శ్వాసకోశ అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసిని ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల చికిత్సకు వాడుతారు. తులసి నీటిని తాగితే శ్వాసకోశ వ్యవస్థపై ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: దాల్చినచెక్క, నిమ్మకాయను ఇలా తీసుకుంటే చాలు.. బరువు మొత్తం తగ్గుతారు..! #health-tips #health-benefits #tulsi-water మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి