Health Tips : జీవనశైలిలో మార్పులు, కాలుష్యం కారణంగా ముఖంలో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. అందం తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ బిజీలైఫ్ లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్దవహించే సమయం ఉండటం లేదు. దీంతో చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. ముడుతల పడే చర్మం కోసం మీరు ఇంట్లో తయారు చేసిన రకరకాల ఫేస్ ప్యాకులను ఉయోగించవచ్చు. ఇవన్నీ కూడా చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అయితే వైన్, బీర్ తాగుతే కూడా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చని పలువురు అంటున్నారు. వైన్ , బీర్ వంటివి చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుతాయి?అధ్యయనాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం.
వైన్ అంటే ఏమిటి?
వైన్ ఒక ఆల్కహాలిక్ డ్రింక్. ద్రాక్ష పండ్లను ఈస్ట్‌తో కలిపి పులియబెట్టినప్పుడు, చక్కెర కంటెంట్ కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. ఈ ప్రక్రియలో ఇథనాల్ విడుదల అవుతుంది. పండ్లను పులియబెట్టడం ద్వారా వైన్ తయారు చేస్తారు.
బీర్ అంటే ఏమిటి?
బీర్ కూడా ముడి పదార్థాలను నీటితో ఉడకబెట్టడం లేదా పులియబెట్టడం ద్వారా పొందిన ఆల్కహాలిక్ పానీయం. ఇది బియ్యం, వోట్స్, గోధుమలతో తయారు చేస్తారు.
వైన్ చర్మానికి మంచిదా?
వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అయిన టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను పునరుద్ధరిస్తుంది. వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.
బీర్ చర్మానికి మంచిదా?
ఇది చర్మానికి పోషణనిస్తుంది. విటమిన్ బిని కలిగి ఉంటుంది, ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,పోషణగా ఉంచుతుంది.
వైన్ చర్మకాంతిని పెంచుతుందా?
వైన్‌లోని పాలీఫెనాల్ కంటెంట్ డల్ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మచ్చలను తొలగిస్తుంది.
బీర్ చర్మాన్ని మెరిసేలా చేస్తుందా?
బీర్‌లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం యొక్క pH బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
రెండింటిలో చర్మానికి ఏది మంచిది?
తాజా రెడ్ వైన్, బీర్ రెండూ వివిధ రకాల చర్మ ప్రయోజనాలను అందిస్తాయి. కానీ రెండింటినీ చాలా పొదుపుగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే, అందులోని ఆల్కహాల్ శరీర ఆరోగ్యానికి మంచిది కాదు.