/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/vip-store-jpg.webp)
హైదరాబాద్ నగరంలో నిత్యం ఏదోక మూల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉంటున్నాయి. తాజాగా వనస్థలిపురం వీఐపీ స్టోర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఉదయం 6: 30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అగ్ని ప్రమాదం గురించి తెలియగానే ఫైర్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతానికి ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే దాని మీద విచారణ చేపట్టారు.
Also read: విశాఖలో ఇన్ఫోసిస్.. నేడు ప్రారంభించనున్న జగన్.. వివరాలివే!
పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ప్రమాదం కారణంగా సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు.. షాప్ నిర్వాహకులు తెలియజేశారు.
ఈ స్టోరీ అప్ డేట్ అవుతుంది..